
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన కుమార్తె మాల్తీ మేరీకి భారతీయ సంప్రదాయాలను పరిచయం చేస్తూ ఉంటారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ మన సంస్కృతి, పండుగలు, ఆచారాలకు ఆమె ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా ప్రియాంక షేర్ చేసిన ఓ వీడియో ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేస్తోంది.
తన ఫ్యామిలీ వెకేషన్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ప్రియాంక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో ఓ వీడియోలో చిన్నారి మాల్తీ తన తల్లి ఒడిలో కూర్చొని గాయత్రీ మంత్రాన్ని ఎంతో ముద్దుగా చెబుతోంది. ఇంట్లోని పూజా మందిరం ముందు కూర్చున్న మాల్తీ.. ‘ఓం భూర్భువః స్వః’ అంటూ మంత్రాన్ని చదువుతుండటం ఈ వీడియోలో కనిపిస్తుంది. చివర్లో ప్రియాంక ‘సో బ్యూటిఫుల్’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ వీడియోతో పాటు ప్రియాంక మరికొన్ని వెకేషన్ ఫొటోలను కూడా పంచుకున్నారు. కుమార్తె మాల్తీతో కలిసి బీచ్లో సరదాగా గడుపుతున్న ఫొటోలు, ఇసుకతో బొమ్మలు చేస్తూ ఆడుకుంటున్న మాల్తీ పిక్స్ అందులో ఉన్నాయి. ప్రియాంక తల్లి మధు చోప్రా కూడా ఈ వెకేషన్లో పాల్గొన్నారు.

ప్రియాంక, నిక్ జోనాస్ దంపతులు తమ కుమార్తెకు భారతీయ, అమెరికన్ సంస్కృతుల పరిచయం కల్పించాలని భావిస్తున్నట్లు గతంలోనూ వెల్లడించారు. దీపావళి వంటి భారతీయ పండుగలను జరుపుకోవడంతో పాటు సంప్రదాయ ప్రార్థనలను కూడా మాల్తీకి పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు గాయత్రీ మంత్రాన్ని మాల్తీ చదువుతున్న వీడియో చూసిన అభిమానులు ఆమెను అభినందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: వారణాసి వాయిదా.. బాల్ రాజమౌళి కోర్టులో లేదా.?
ఇక సినిమాల విషయానికొస్తే.. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘వారణాసి’లో ప్రియాంక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.
మీకు నచ్చవచ్చు:
రెండేళ్లుగా మంచానికే పరిమితమైన స్టార్.. కన్నీళ్లు తెప్పిస్తున్న రియల్ స్టోరీ.!
రెండు వారాల్లోనే 1500 కోట్లు.. ధురంధర్ 2, పుష్ప 2 రికార్డులు బ్రేక్.!
[Priyanka Chopra Daughter, Malti Marie, Gayatri Mantra, Nick Jonas, Varanasi Movie]





