Home

»

Latest News

ప్రియాంక సోదరుడిపై కేసు..

Jul 15, 2016 5:46PM

సెలబ్రెటీలు ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరును వారి సోదరులు చెడగొడుతున్నారు.ఉదాహరణకు తెలుగు హీరో రవితేజ ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా స్వయంకృషితో హీరోగా ఎదిగాడు. అయితే ఆయన సోదరులు రఘు, భరత్‌లు పలుసార్లు డ్రగ్స్ కేసులో ఇరుక్కుని వారు జైలుపాలవ్వడమే గాకుండా..రవితేజకి చెడ్డపేరు తీసుకువచ్చారు. ఇప్పుడు అలాంటి కష్టాలే బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంకచోప్రాకు ఎదురయ్యాయి. అక్రమంగా హుక్కాను సరఫరా చేస్తున్న కేసులో ప్రియాంక సోదరుడు సిద్థార్థ్ చోప్రాపై కేసు నమోదైంది. హోటల్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేట్ అయిన సిద్థార్థ్ చోప్రా ప్రస్తుతం పూణేలోని కారేగావ్ పార్క్ సెంటర్‌లో ద మగ్ షాట్ లాంజ్ పేరుతో ఓ రెస్టారెంట్‌ను నడుపుతున్నాడు. నో స్మోకింగ్ జోన్‌లో పొగాకు వాడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేయగా..హుక్కా వ్యవహారం బయటపడింది. ఇదే రెస్టారెంట్‌లో మే నెలలో ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌కు పాల్పడిన 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com