Home

»

Latest News

సాంగ్ షూట్ లో ఆ హీరో పదేపదే నాకు ముద్దులుపెట్టాడు.. ఫ్యాన్స్ ఫీలైనా ఇది నిజం  

Jun 10, 2026 3:03PM

 

 

సినీ ఇండస్ట్రీ ఎంతో గ్లామరస్‌గా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ ఆ  కనిపించే గ్లామర్  రంగుల వెనుక ఎందరో నటీమణులు ఎదుర్కొనే మానసిక సంఘర్షణలు ఉంటాయి. ముఖ్యంగా కెరీర్ ప్రారంభ రోజుల్లో కొత్తగా వచ్చే నటీనటులు ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ప్రముఖ బాలీవుడ్, మరాఠీ నటి ప్రియా బాపట్ తన కెరీర్ మొదట్లో ఎదురైన అత్యంత భయానక, అసౌకర్యకరమైన సంఘటన గురించి చెప్పి   అందరినీ ఆశ్చర్యపరిచారు. 

రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియా బాపట్ మాట్లాడుతూ 'సాంగ్ చిత్రీకరణ సమయంలో 'ఇంప్రూవైజేషన్' (సందర్భోచితంగా మార్పులు చేయడం) అనే పేరుతో హీరో  హద్దులు మీరుతూ ప్రవర్తించాడు. సీన్ డిమాండ్ చేయకపోయినా, డైరెక్టర్ కట్ చెప్పినా కూడా నన్ను పదే పదే ముద్దు పెట్టుకుంటూనే ఉన్నాడు. దాంతో  తీవ్ర అసౌకర్యానికి, ఆందోళనకి గురయ్యాను. వయసు చిన్నది కావడం, ఇండస్ట్రీ కొత్త అవ్వడంతో ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియక నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను.

Also read: sreeja konidela: తప్పు తెలుసుకొని పూర్తిగా మారిపోయాను.. శ్రీజ కొణిదెల ఎమోషనల్ వీడియో వైరల్ 


సమస్య అక్కడితోనే ఆగిపోలేదు. భోపాల్‌లో ఒకే హోటల్‌లో స్టే చేసాం. ఒకే హోటల్‌లో వేర్వేరు గదుల్లో ఉంటున్నప్పటికీ ప్రతిరోజూ నన్ను బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్‌కి  రావాలని ఒత్తిడి చేసేవాడు. నేను నో అని చెప్పినప్పటికీ అతనిలో మార్పు రాలేదు. ఒక రోజు రాత్రి నా గది వద్దకు వచ్చి తలుపు తట్టాడు. దీంతో నేను తీవ్ర భయాందోళనకి  గురయ్యాను. నేను వెంటనే రేపు కలుద్దామని చెప్పి   తప్పించుకున్నాను. ఆ తర్వాత వెంటనే నా భర్తకి  ఫోన్ చేసి జరిగిన విషయాలన్నీ చెప్పాను. దీంతో మా ఆయన వెంటనే నా దగ్గరకు వచ్చేశాడు. మూడు రోజుల పాటు నాతోనే ఉండి ధైర్యం చెప్పాడు. కుటుంబ సభ్యుల మద్దతు లేకపోతే సినిమా ఇండస్ట్రీలో మనుగడ సాగించలేం అని ప్రియా బాపట్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ నటి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

 

 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com