Home

»

Latest News

తెలుగు ప్రేక్ష‌కుల‌కు పృథ్విరాజ్‌ బహిరంగ క్షమాపణ..  మ‌ళ్లీ ఆ త‌ప్పు చేయ‌ను.!

Jul 13, 2026 4:21PM

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలక్షణమైన నటనతో, విభిన్నమైన కథాంశాలతో సౌత్ ఇండియాలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన 'సలార్' సినిమాలో వరదరాజ మన్నార్‌గా పృథ్వీరాజ్ పోషించిన పాత్ర తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఆ సినిమా అందించిన భారీ క్రేజ్, బలమైన నమ్మకంతోనే ఆయన తన తాజా సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం 'ఐ నో బడి' ని నేరుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేశారు. అయితే, ఎన్నో అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ల వైఫల్యాలపై, జరిగిన తప్పులపై హీరో పృథ్వీరాజ్ స్వయంగా స్పందిస్తూ తెలుగు ప్రేక్షకులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సినిమా పరాజయానికి, ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవడానికి ప్రధాన కారణం టైటిల్ విషయంలో జరిగిన తీవ్రమైన కన్ఫ్యూజన్. సినిమా ప్రమోషన్ల సమయంలో ప్రొడక్షన్ టీమ్ అంతా ఇంగ్లీష్‌ టైటిల్ 'ఐ నో బడి' అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ, ఆడియన్స్ థియేటర్లలోకి వెళ్లి స్క్రీన్ మీద చూసేసరికి 'ఐ ఎవరూ లేరు' అనే వింతైన టైటిల్ కనిపించింది. ఇంగ్లీష్‌ లైన్‌ను తెలుగులోకి సరిగ్గా ట్రాన్స్‌లేట్ చేయకపోవడం వల్ల వచ్చిన ఈ అనువాద లోపం సాధారణ ప్రేక్షకులను తీవ్ర గందరగోళానికి గురిచేసింది. దీనికి తోడు గ్రౌండ్ లెవెల్‌లో పబ్లిసిటీ అసలు శూన్యమనే చెప్పాలి. పృథ్వీరాజ్ స్వయంగా హైదరాబాద్ వచ్చి గ్రాండ్‌గా ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ, ఆ తర్వాత ప్రమోషన్స్ పూర్తిగా నత్తనడకన సాగాయి. సినిమా అసలు ఎప్పుడు రిలీజ్ అయిందో, ఏయే థియేటర్లలో నడుస్తోందో కూడా చాలా మంది సాధారణ ప్రేక్షకులకు కనీస సమాచారం లేకుండా పోయింది. ఈ వీక్ పబ్లిసిటీ ఎఫెక్ట్ వల్ల బాక్సాఫీస్ వద్ద కనీస ఓపెనింగ్స్ కూడా నమోదు కాలేదు. జనాలు లేక బీసీ సెంటర్లలో కొన్ని చోట్ల షోలు కూడా రద్దయ్యే పరిస్థితి వచ్చింది.

మరోవైపు, ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ కూడా ఎదురైంది. ప్రస్తుతం థియేటర్లలో 'లెనిన్' సినిమా బాక్సాఫీస్ హవా నడుస్తోంది. దీనితో పాటు ఇంగ్లీష్ డబ్బింగ్ హారర్ మూవీ 'ఈవిల్ డెడ్ బర్న్', మరో డబ్బింగ్ చిత్రం 'హృదయం మురళి' రేసులో ఉండటంతో 'ఐ నో బడి' కి మంచి థియేటర్లు దొరకడమే కష్టంగా మారింది. పైగా, ఈ మధ్య కాలంలో మన తెలుగు ప్రేక్షకులు మలయాళ కంటెంట్ ఆధారిత సినిమాలను థియేటర్ల కంటే ఓటీటీ  వేదికలపై చూసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వీటన్నింటిపై పృథ్వీరాజ్ ఓపెన్‌గా స్పందిస్తూ.. కేవలం ఒక ప్రెస్ మీట్ పెడితే సరిపోదని, బ్రాండింగ్ లోపాలు, టైటిల్ ట్రాన్స్‌లేషన్ లోపాలు సినిమాను దెబ్బతీశాయని అంగీకరించారు. ఈసారికి తనను క్షమించమని, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటానని ప్రామిస్ చేశారు. ప్రస్తుతం నితిన్ 'వారణాసి' చిత్రంలో పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తూ తెలుగు మార్కెట్‌పై కన్నేసిన పృథ్వీరాజ్, ఈ ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకుని నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో గట్టి కంబ్యాక్ ఇస్తారని ఆశిద్దాం.

 

 

 

Prithviraj Sukumaran, I No Body, Salaar, Varanasi Movie 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com