Home

»

Latest News

అమెజాన్‌లో పృథ్వీరాజ్ థ్రిల్లింగ్ హ్యాట్రిక్!

Sep 23, 2021 4:55PM

మాలీవుడ్ లో మ‌ల్టిటాలెంటెడ్ గా గుర్తింపు పొందారు పృథ్వీరాజ్ సుకుమార‌న్. ఒక‌వైపు న‌టుడిగా రాణిస్తూనే మ‌రోవైపు ద‌ర్శ‌కుడిగానూ, గాయ‌కుడిగానూ, నిర్మాత‌గానూ, పంపిణీదారుడిగానూ, యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్ గానూ మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌దైన ముద్ర వేస్తున్నారాయ‌న‌.  క‌రోనా లాక్ డౌన్ కి ముందు `డ్రైవింగ్ లైసెన్స్`, `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్` చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ థియేట్రిక‌ల్ హిట్స్ అందుకున్న పృథ్వీ... క‌రోనా సెకండ్ వేవ్ టైమ్ లో ప్ర‌ముఖ ఓటీటీ వేదిక‌ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన `కోల్డ్ కేస్`, `కురుతి` చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ ఓటీటీ హిట్స్ అందుకుని వార్త‌ల్లో నిలిచారు.  

ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. ఆ రెండు సినిమాలు కూడా థ్రిల్ల‌ర్ మూవీస్ గానే తెర‌కెక్కాయి. అంతేకాదు.. అతి త్వ‌ర‌లో మ‌రో థ్రిల్ల‌ర్ మూవీతో పృథ్వీరాజ్ అమెజాన్ ప్రైమ్ లో సందడి చేయ‌బోతున్నారు. ఆ చిత్ర‌మే.. బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `అంధాధున్`కి రీమేక్ గా తెర‌కెక్కిన `భ్ర‌మ‌మ్`.  మాతృక‌లో ఆయుష్మాన్ ఖురానా న‌టించిన అంధుడి పాత్ర‌లో పృథ్వీ ఎంట‌ర్టైన్ చేయ‌నున్నారు. జూన్ లో `కోల్డ్ కేస్`, ఆగ‌స్టులో `కురుతి`తో మురిపించిన పృథ్వీ.. అక్టోబ‌ర్ 7న స్ట్రీమ్ కానున్న `భ్ర‌మ‌మ్`తో అమెజాన్ ప్రైమ్ లో థ్రిల్లింగ్ హ్యాట్రిక్ అందుకుంటారేమో చూడాలి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com