Home

»

Latest News

ప్రేమ కావాలి 75 సెంటర్లలో 50 రోజులు

Apr 11, 2011 11:23PM

prema kavali wallpapers, prema kavali stills, prema kavali images, prema kavali pics, prema kavali photos, prema kavali pictures "ప్రేమ కావాలి" 75 సెంటర్లలో 50 రోజులు ఆడింది. ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతోంది. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, డైలాగ్ కింగ్ సాయికుమార్ కుమారుడు ఆదిని హీరోగా పరిచయం చేస్తూ, కె.విజయభాస్కర్ దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్ నిర్మించిన యూత్ ఫుల్ ప్రేమకథా చిత్రం "ప్రేమ కావాలి". ఈ "ప్రేమ కావాలి" చిత్రం విడుదలై ఇటీవల అర్థశతదినోత్సవం పూర్తి చేసుకుంది. అది కూడా ఒక కొత్త హీరో సినిమా 75 సెంతర్లలో 50 రోజులు పూర్తిచేసుకోవటమంటే మామూలు విషయం కాదు.

 

అసలు ఒక సినిమా నాలుగు వారాలాడితేనే "మా సినిమా పెద్ద హిట్టు" అని రొమ్ములు బాదుకుంటూ చెప్పుకునే ఈ రోజుల్లో ఈ "ప్రేమ కావాలి" చిత్రం నిశ్శన్దంగా 75 సెంటర్లలో 50 రోజులు ఆడింది. ముఖ్యంగా హీరో ఆదికి ఇది తొలి చిత్రమైనా ఎంతో అనుభవమున్న హీరోలా నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుని, విమర్శకుల ప్రశంసలు సైతం పొందటం విశేషం.  హీరో ఆది నటన, డ్యాన్సుల్లో, ఫైట్స్ లో చురుకుదనం, అనూప్ రూబెన్స్ వీనులకింపైన సంగీతం, విజయభాస్కర్ దర్శకత్వ ప్రతిభ, రాజీ పడకుండా నిర్మించిన నిర్మాత డాక్టర్ వెంకట్ నిర్మాణపు విలువలు, వీటన్నిటికంటే కె.అచ్చిరెడ్డిగారి పర్యవేక్షణ, బి.ఎ.రాజుగారి ప్రమోషన్ కలగలసి విశేష ప్రేక్షకాదరణతో ఈ "ప్రేమ కావాలి" చిత్రానికింతటి ఘనవిజయం సమకూర్చాయని చెప్పవచ్చు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com