Home

»

Latest News

Preity zinta: హైకోర్టుకి ప్రీతీ జింటా.. తిక్క కుదిరింది!

Jul 3, 2026 3:55PM

 

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)విక్టరీ వెంకటేష్(venkatesh)లతో రాజకుమారుడు,ప్రేమంటే ఇదేరాతో జతకట్టి తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన హీరోయిన్ ప్రీతి జింటా. బాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో చేసి అగ్ర హీరోయిన్ టాగ్ లైన్ పొందిన ప్రీతి జింటా తన  గుర్తింపుని  కాపాడుకోవడానికి సరికొత్త చట్టపరమైన పోరాటానికి తెరతీశారు.


 ఆన్‌లైన్ వేదికలపై తన అనుమతి లేకుండా సృష్టిస్తున్న ఏఐ డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకరమైన మీమ్స్ తన పేరుతో నడుస్తున్న ఏఐ చాట్‌బాట్ ప్రొఫైల్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వ హక్కులు, కాపీరైట్ చట్టాలని ఎ ఐ   కంటెంట్ తీవ్రంగా ఉల్లంఘిస్తోందని, దీనివల్ల దశాబ్దాలుగా తాను సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు, బ్రాండ్ వాల్యూ మంటగలుస్తున్నాయని ఆవేదన చెందుతూ బాంబే హైకోర్టుని  ఆశ్రయించారు. కేసుని విచారించిన బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవ్ జమ్దార్, జస్టిస్ అభయ్ అహుజా బెంచ్, ప్రీతి జింటా దాఖలు చేసిన పిటిషన్‌ని పరిగణించింది. 

గూగుల్ ఎల్‌ఎల్‌సీ (Google LLC), మెటా ప్లాట్‌ఫామ్స్ (Meta), ఎక్స్ కార్ప్ (X Corp) వంటి దిగ్గజ సోషల్ మీడియా కంపెనీలతో పాటు సుమారు 12 కంటే ఎక్కువ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై అధికారికంగా సివిల్ సూట్ దాఖలు చేయడానికి కోర్టు అనుమతి మంజూరు చేసింది. ప్రీతి జింటా తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ వెంకటేష్ ధోండ్ మరియు రోహన్ కదమ్, ప్రస్తుతం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న డీప్‌ఫేక్ కంటెంట్ నాణ్యత రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతోందని కోర్టుకి  వివరించారు. ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులుతన క్లయింట్ ముఖాన్ని, వాయిస్‌ని వాడుకుని కంటెంట్ క్రియేట్ చేయకుండా శాశ్వత నిషేధ ఉత్తర్వులు (Permanent Injunctions) ఇవ్వాలని వారు కోరారు.


Also read: Vijay: విజయ్, త్రిష విషయంలో ఒకరి అరెస్ట్.. అరెస్ట్ అయ్యింది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు


మరోవైపు టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటా సంస్థల న్యాయవాదులు కోర్టులో తమ వాదనలను వినిపించారు. హీరోయిన్ ప్రీతి జింటా ఫ్లాగ్ చేసిన లేదా గుర్తించిన వివాదాస్పద లింకులను, మార్ఫింగ్ చేసిన అసభ్యకర కంటెంట్‌ను తమ ప్లాట్‌ఫామ్‌ల నుండి వెంటనే తొలగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కోర్టుకు తెలిపారు. అయితే, ఇంటర్నెట్‌లోని మొత్తం కంటెంట్‌ని  నిరంతరం పర్యవేక్షించడం లేదా ఎలాంటి ఆధారాలు లేకుండా ముందస్తుగానే కంటెంట్‌ని బ్లాక్ చేయడం సాధ్యం కాదని కోర్టుకి  అభ్యర్థించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం, వివాదాస్పద కంటెంట్‌ను వెబ్‌సైట్ల నుండి సమర్థవంతంగా తొలగించడానికి (Takedown Mechanism) ఇరు పక్షాలు కలిసి ఒక నిర్దిష్టమైన ప్రణాళికను లేదా విధానాన్ని రూపొందించాలని సూచించింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com