Home

»

Latest News

Sriramudu: రాముడిపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు 

Apr 17, 2026

 

 

-సరికొత్త వివాదంలో ప్రకాష్ రాజ్ 
-రాముడంటే ప్రకాష్ రాజ్ ఏమనుకుంటున్నాడు
-ప్రకాష్ రాజ్ మాటలతో రామ భక్తుల నిరసన 
-పోటాపోటీగా కేసులు 

హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు(Sriramudu)మంచి కార్యక్రమం తలపెట్టినా, శుభకార్యాలు మొదలు పెట్టినా  రాముడిని తలచుకోకుండా ఏ పనిమొదలుపెట్టరు. రాముడి గుడి లేని ఊరు కూడా ఉండదు. అసలు నోటి వెంట శ్రీరామ నామం రానిదే నిద్ర కూడా పోరు. . అంతలా హిందుల జీవన విధానంలో రామభద్రుడు సదా చిరస్మనీయుడుగా ఉన్నాడు. మరి అలాంటి శ్రీరాముడిపై ప్రకాష్ రాజ్(Praksh raj)చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వాళ్ళందర్నీ బాధకి గురి చేస్తున్నాయి.  ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడాడో చూద్దాం.

ప్రకాష్ రాజ్ రీసెంట్ గా కేరళ రాష్ట్రంలో జరిగిన సాహిత్య ఉత్సవంలో మతసామరస్యం, ప్రజల విశ్వాసం అనే కార్యక్రమంలో పాల్గొన్నాడు. అందులో ప్రకాష్ రాజ్ మాట్లాడుతు  రాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతానికి చెందిన వలస కూలీలు. వారిద్దరూ దక్షిణ భారతానికి చెందిన రావణుడి పొలంలో పండ్లు దొంగిలించారు. శూర్పణఖ ఆ దొంగతనాన్ని చూసి జిఎస్టితో కలుపుకొని రెండు వేల డాలర్స్ కట్టాలని అడిగిందనే వ్యాఖ్యలు చేయడంతో పాటు ఈ దేశంలో  ప్లాన్ ప్రకారం ముస్లిమ్స్,గిరిజనుల్ని తుడిచిపెట్టాలనుకొని కొన్ని శక్తులు అనుకుంటున్నాయని చెప్పుకొచ్చాడు.

Also read: Thimmarajupalli TV Movie Review: తిమ్మరాజుపల్లి టీవీ మూవీ రివ్యూ

హిందూ సంఘాలు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై భగ్గుమంటున్నాయి. పలు ఏరియాల్లో కేసులు కూడా నమోదు చేసారు. తాను నటిస్తున్నట్టుగా కన్ఫర్మ్  అయిన వారణాసి, స్పిరిట్ చిత్రాల నుంచి ప్రకాష్ రాజ్ ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ రీసెంట్ గా డెకాయిట్ మూవీలో కనిపించిన విషయం తెలిసిందే 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com