ENGLISH | TELUGU  

ప్రభాస్ కి పోటీగా నాగార్జున.. లాటరీ కొడతాడా?

on Feb 1, 2026

 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ'(Fauzi) సినిమా చేస్తున్నాడు. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాను ఈ ఏడాది దసరాకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇదే దసరా సీజన్ పై కింగ్ నాగార్జున(Nagarjuna) కూడా కన్నేశాడు.

 

నాగార్జున తన ప్రతిష్టాత్మక 100వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వంలో నాగార్జుననే ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. లాటరీ బ్యాక్ డ్రాప్ లో ఒక సామాన్యుడు సంపన్నుడిగా ఎదిగిన వైవిధ్యమైన కథతో ఇది తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి 'లాటరీ కింగ్' అనే ఆసక్తికర టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని కూడా దసరాకు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. (Nag 100)

 

నాగార్జున ఒక మంచి హిట్ కోసం కసిగా ఎదురుచూస్తున్నాడు. పైగా వందో సినిమా కావడంతో 'లాటరీ కింగ్'పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు. అక్కినేని అభిమానులు కూడా ఈ సినిమాతో నాగార్జున భారీ విజయాన్ని అందుకుంటాడని నమ్మకంగా ఉన్నారు. అయితే ఈ సినిమా 'ఫౌజీ'కి పోటీగా విడుదలవుతుండటమే ఆసక్తికరంగా మారింది. మరి ప్రభాస్ తో బాక్సాఫీస్ ఫైట్ కి దిగి, నాగార్జున హిట్ అందుకుంటాడేమో చూడాలి.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.