Home

»

Latest News

నిత్య మీనన్ ని వద్దన్న ప్రభాస్

Jun 29, 2011 12:46PM

నిత్య మీనన్ ని వద్దన్న ప్రభాస్ అని ఫిలిం నగర్ వర్గాల్లో వినపడుతూంది. వివరాల్లోకి వెళితే " మీరు ప్రభాస్ పక్కన నటించాల్సి వస్తే ఎలా ఫిలవుతారు...? " అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు "హూ ఈజ్ ప్రభాస్...? " అని నిత్యా మినన్ అనటం వెనుక చాలా కథే జరిగింది. అసలు విషయమెమిటంటే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో, జె.భగవాన్, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం"రెబెల్". ఈ "రెబెల్" సినిమాలో హీరోయిన్ గా ముందుగా నిత్య మీనన్ ని అనుకున్నారట.

కానీ ప్రభాస్ హైట్ కి, అతని పక్కన నిత్య మీనన్ చాలా పొట్టిగా కనపడుతుందని ఆమెను హీరో ప్రభాస్ వద్దని, దీక్షాసేథ్ ని హీరోయిన్ గా తీసుకున్నాడట. దాన్ని దృష్టిలో పెట్టుకుని నిత్య మీనన్ "హూ ఈజ్ ప్రభాస్...? " అని తనను వద్దన్నందుకు అతని మీద పగతీర్చుకుందన్నమాట. ఇక్కడ తెలుగులో ఆమె నటించింది కేవలం "అలా మొదలయ్యింది, 180" రెండు సినిమాలు మాత్రమే. వీటిలో "అలా మొదలయ్యింది" మాత్రమే హిట్టయ్యింది. అంత మాత్రానికే ఇంత మిట్టిపాటా నిత్య మీనన్.కరెక్ట్ కాదు కదమ్మా...ఇలా అయితే భవిష్యత్తులో దెబ్బయిపోగలవు జాగ్రత్త.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com