Home

»

Latest News

Prabhas: ఆలియా భట్‌కు సపోర్ట్‌గా ప్రభాస్.. ఆ రూమర్స్ నిజమేనా?

Jul 1, 2026 11:05AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. తోటి నటీనటుల సినిమాలకు ఎప్పుడూ అండగా నిలిచే మన డార్లింగ్, ఈసారి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt) నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆల్ఫా' (Alpha) చిత్రబృందానికి అదిరిపోయే సపోర్ట్ అందించారు. ఆల్ఫా మూవీ ట్రైలర్‌ను ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ, ఆలియా భట్‌తో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభాస్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట ఒక సంచలనంగా మారింది. కేవలం అభిమానుల్లోనే కాకుండా మొత్తం సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.

ప్రభాస్ చూపించిన ఈ అప్యాయతకు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కూడా అంతే వేగంగా స్పందించారు. ప్రభాస్ పోస్ట్‌ను రీషేర్ చేస్తూ, “థ్యాంక్యూ సో మచ్ ప్రభాస్” అంటూ ఎంతో సంతోషంతో తన కృతజ్ఞతలను చాటుకున్నారు. సోషల్ మీడియా వేదికగా వీరిద్దరి మధ్య జరిగిన ఈ స్వీట్ కన్వర్జేషన్ ఇప్పుడు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే, ఈ పోస్ట్ వెనుక ఒక పెద్ద సినిమాటిక్ ట్విస్ట్ ఉందంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా బాలీవుడ్ చిత్రాల ట్రైలర్లను ప్రభాస్ ప్రమోట్ చేయడం అరుదు. అలాంటిది ఆలియా సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా స్పందించడం వెనుక ఒక బలమైన కారణం ఉందనే ప్రచారం జోరందుకుంది.

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఒక క్రేజీ రూమర్ తెగ హల్‌చల్ చేస్తోంది. దర్శకుడు నాగ్‌ అశ్విన్ విజువల్ వండర్ 'కల్కి 2898 AD' సీక్వెల్‌ (Kalki 2) లో ఆలియా భట్ ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో జరిగిన రెండవ షెడ్యూల్‌లో ఆలియా భట్ దాదాపు 5 రోజుల పాటు సైలెంట్‌గా షూటింగ్‌లో కూడా పాల్గొన్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ సీక్వెల్‌లో ఆమె దీపికా పదుకొణె పాత్రను రీప్లేస్ చేయడం లేదని, కథను మలుపు తిప్పే ఒక సరికొత్త పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రభాస్ స్వయంగా ఆలియాకు సోషల్ మీడియాలో మద్దతు తెలపడంతో, ఈ 'కల్కి 2' రూమర్స్‌ నిజమేనంటూ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

కాగా, ఆలియా భట్ నటిస్తున్న 'ఆల్ఫా' చిత్రం యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్ లో వస్తున్న మొట్టమొదటి ఫీమేల్ లీడ్ యాక్షన్ ఫిల్మ్ కావడం విశేషం. ఈ సినిమా జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com