Home

»

Latest News

Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’ నుండి పవర్‌ఫుల్ డైలాగ్ లీక్.. థియేటర్స్ బద్దలవ్వడం ఖాయం!

Jun 4, 2026 5:27PM

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'స్పిరిట్'. పాన్ ఇండియా రేంజ్‌లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంగా సాగుతోంది. నగరంలోని ప్రముఖ సింగిల్ స్క్రీన్ విమల్ థియేటర్లో గత రెండు రోజుల క్రితం ఒక కీలకమైన షెడ్యూల్ షూట్‌ను చిత్ర యూనిట్ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రత్యేకమైన యాక్షన్ షెడ్యూల్ షూటింగ్‌లో హీరో ప్రభాస్ కూడా పాల్గొని సందడి చేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాను ఒక్కసారిగా ఊపేస్తోంది. 'స్పిరిట్' మూవీలోని ఒక పవర్‌ఫుల్ అండ్ ఇంటెన్స్ డైలాగ్ లీక్ అయినట్లుగా నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది.

నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఆ లీక్డ్ డైలాగ్ విషయానికి వస్తే.. “చట్టాన్ని ఫాలో అవ్వను.. నేనే చట్టం“ అనే లైన్ ఇప్పుడు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ మాస్ డైలాగ్ నిజంగా సినిమాలో ఉందా లేదా అనేది పక్కన పెడితే, ప్రభాస్ భారీ కటౌట్‌కు మరియు సందీప్ రెడ్డి యాక్షన్ ఇంటెన్సిటీకి ఈ వన్-లైనర్ పక్కాగా సెట్ అవుతుందని రెబల్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. 

ఈ సినిమాలో ప్రభాస్ మునుపెన్నడూ చూడని ఒక పవర్‌ఫుల్, రగ్గడ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఖాకీ యూనిఫామ్ వేసి కనిపించబోతున్నారు. సందీప్ మార్క్ వైల్డ్ యాక్షన్‌తో ప్రభాస్ గనుక ఈ డైలాగ్ థియేటర్లలో చెబితే బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో ప్రభాస్ సరసన బాలీవుడ్ క్రేజీ బ్యూటీ తృప్తి డిమ్రి కథానాయికగా నటిస్తుండగా, పవర్‌ఫుల్ విలన్ పాత్రలో వివేక్ ఓబరాయ్ నటిస్తున్నారు. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాలతో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి, ఈసారి ప్రభాస్‌ను సరికొత్త యాంగిల్‌లో ప్రెజెంట్ చేయబోతున్నారనే వార్తలు ఇండస్ట్రీలో విపరీతమైన బజ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. లీక్ అయిన ఈ సింగిల్ డైలాగ్ లైన్ చూస్తుంటేనే సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమవుతోందని, సిల్వర్ స్క్రీన్‌పై ప్రభాస్ రాంపేజ్ చూడటానికి రెండు కళ్లూ సరిపోవని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com