
`సాహో` తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ `జిల్ ` ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం షెడ్యూల్ ఇటలీలో జరిగింది. అయితే తాజాగా ఈ చిత్ర స్టోరి కి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
అదేమిటంటే....``1960 బ్యాక్ డ్రాప్ లో జరిగే లవ్ స్టోరీ గా చిత్రం రూపొందుతుందట. ఇందులో ప్రభాస్ వింటేజ్ కార్లను కొనుగోలు చేసే రిచ్ మ్యాన్ గా కనిపించబోతున్నాడట. ఈ సినిమాకు వింటేజ్ కార్లకు చాలా దగ్గర రిలేషన్ ఉందన్న `` విషయాన్ని చిత్ర దర్శకుడే ఇటీవల ట్విట్టర్ లో పోస్ట్ చేయడం విశేషం. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అవుతోంది. మూడు భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం గోపీకృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ బేనర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2019 ఆఖరులో ఈ సినిమాను రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉంది చిత్ర యూనిట్. ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం `సాహో` స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రానున్న విషయం తెలిసిందే.






