Home

»

Latest News

ఆ రూమర్స్ నమ్మకండి.. ప్రభాస్ టీమ్ సంచలన ప్రకటన.!

Jul 8, 2026 5:37PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్‌పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. రోజుకో కొత్త దర్శకుడి పేరు తెరపైకి వస్తుండటంతో అభిమానుల్లో కూడా తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభాస్ సన్నిహిత వర్గాలు తాజాగా క్లారిటీ ఇచ్చాయి. ప్రస్తుతానికి ప్రభాస్ ఎలాంటి కొత్త సినిమాలకు అంగీకరించలేదని, ఇప్పట్లో కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచన కూడా ఆయనకు లేదని ప్రభాస్ టీమ్  తేల్చి చెప్పింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి ఏమాత్రం రెస్ట్ లేకుండా రాత్రింబగళ్లు కష్టపడుతున్నారని సమాచారం. ఇలాంటి టైమ్‌లో మరిన్ని కొత్త సినిమాలు ఒప్పుకుని, అనవసరంగా తనపై తాను మానసిక ఒత్తిడి పెంచుకోవడానికి ప్రభాస్ సిద్ధంగా లేరని ఆయన సన్నిహితుల మాట.

హోంబలే ఫిలిమ్స్ నిర్మాతలు ఇటీవల ఒక అద్భుతమైన స్టోరీలైన్‌తో ప్రభాస్‌ను సంప్రదించారట. ఆ కథలోని మెయిన్ పాయింట్ ప్రభాస్‌కు ఎంతగానో నచ్చినప్పటికీ, తనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన ఈ ప్రాజెక్ట్‌కు సున్నితంగా 'నో' చెప్పేసినట్లు తెలిసింది. ఆ కథపై నమ్మకంతో ఒక 2 ఏళ్లు అయినా సరే ప్రభాస్ కోసం వెయిట్ చేస్తామని నిర్మాతలు చెప్పినప్పటికీ, తన కోసం అంతకాలం ఆగవద్దని ప్రభాస్ వారిని వారించారట. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ప్రభాస్ కేవలం తన చేతిలో ఉన్న ప్రాజెక్టులపైనే ఎంతలా ఫోకస్ పెట్టారో.

ప్రస్తుతానికి ప్రభాస్ తన లైనప్‌లో ఉన్న 4 ప్రధాన సినిమాలను పూర్తి చేసే పనిలో చాలా బిజీగా ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ డ్రామా 'ఫౌజీ', అలాగే సందీప్ రెడ్డి వంగా మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్‌లో రాబోతున్న 'స్పిరిట్' సినిమాలను ముందుగా పూర్తి చేసేందుకు ప్రభాస్ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ తర్వాత పూర్తిగా గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'కల్కి 2898 AD' సీక్వెల్ అయిన 'కల్కి-2' ప్రాజెక్ట్‌పై తన పూర్తి ఫోకస్ పెట్టనున్నారు. ఈ భారీ చిత్రాల లిస్టులో ఇప్పటికే అందరూ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ప్రశాంత్ నీల్ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'సలార్-2' కూడా ఉంది.

చేతిలో ఇప్పటికే ఇలాంటి 4 భారీ పాన్ ఇండియా సినిమాలు ఉండగా, బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ కాంబోలో ప్రభాస్ ఒక కొత్త సినిమా చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ప్రభాస్ టీమ్ స్పష్టం చేసింది. అంతకుముందు కూడా జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్, లోకేష్ కనగరాజ్ వంటి స్టార్ డైరెక్టర్ల పేర్లు ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లిస్టులో ఉన్నాయంటూ రూమర్స్ వచ్చాయి. వాటన్నింటికీ కూడా ఇప్పుడు ఫుల్‌స్టాప్ పడింది. ప్రస్తుతానికి ప్రభాస్ ఖాతాలో కేవలం ఆ 4 సినిమాలు మాత్రమే ఉన్నాయని, కొత్త కథలేవీ ఆయన వినడం లేదని తెలియడంతో రూమర్స్‌కు పూర్తిగా తెరపడినట్లయింది.

 

 

Prabhas, Fauzi, Spirit, Kalki 2, Salaar 2

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com