Home

»

Latest News

రజాకార్లపై ప్రభాస్ ఒక్కడే: ‘ఫౌజీ’లో వన్ మ్యాన్ ఆర్మీ ఫైట్ మామూలుగా ఉండదు.!

Oct 4, 2026 2:35PM

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘ఫౌజీ’ ఒకటి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన కొన్ని సెట్ ఫొటోలు బయటకు రావడంతో.. సోషల్ మీడియాలో ‘ఫౌజీ’ గురించి కొత్త చర్చ మొదలైంది.

ఈ ఫొటోల్లో ప్రభాస్ ఒంటరిగా ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. చుట్టూ శత్రువులు.. మధ్యలో ప్రభాస్.. వాళ్లందరినీ ఎదుర్కొంటూ ఒక్కడే పోరాడే సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా నిలవనున్నాయని టాక్. ముఖ్యంగా రజాకార్లతో జరిగే పోరాటాల్లో ప్రభాస్ పాత్రను వన్ మ్యాన్ ఆర్మీ తరహాలో డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.

ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగానే ఈ యాక్షన్ సీక్వెన్స్‌లను భారీ స్థాయిలో ప్లాన్ చేశారట. యాక్షన్ కొరియోగ్రాఫర్లు విజయ్, కింగ్ సోలోమన్ ఆధ్వర్యంలో ఈ ఫైట్స్‌ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ పాత్రలోని కోపం, పోరాట పటిమను చూపించేలా యాక్షన్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయని టాక్.

ఇప్పటికే ‘ఫౌజీ’ నుంచి వచ్చిన పోస్టర్లు, ప్రభాస్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అయితే ఈసారి బయటకు వచ్చిన సెట్ ఫొటోలు మాత్రం సినిమాలోని యాక్షన్ ఎలా ఉండబోతోందనే దానిపై ఓ ఐడియా ఇస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్‌ను భారీ యాక్షన్ బ్లాక్స్‌లో చూడాలని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఈ లీక్స్ మరింత హైప్ పెంచుతున్నాయి.

ఇక ‘ఫౌజీ’ కథ స్వాతంత్ర్యానికి ముందు కాలం నేపథ్యంలో సాగుతుంది. దేశభక్తి, ప్రేమ, పోరాటం, ఎమోషన్ వంటి అంశాలను కలిపి హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గతంలో ప్రేమకథలను తనదైన శైలిలో చెప్పిన హను.. ఈసారి ప్రభాస్‌తో ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వి నటిస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ వంటి వారు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ తన షూటింగ్ పార్ట్‌ను వేగంగా పూర్తి చేస్తున్నారు. అక్టోబర్ 20 నాటికి ముగించేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఆ తర్వాత మిగిలిన పనులతో పాటు పోస్ట్ ప్రొడక్షన్‌పై టీమ్ ఫోకస్ పెట్టనుంది.

ఇది కూడా చదవండి: సింగీతం కెరీర్‌లో 'ఆదిత్య 369' ఎందుకంత ప్రత్యేకం.?

 

 

 

[Prabhas Fauzi Action Scene, Prabhas Fauzi Razakars Fight, One Man Army Vs Razakars, Prabhas Fauzi Movie, Hanu Raghavapudi, Prabhas Movies, Telugu Film News]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com