Home

»

Latest News

డార్లింగ్ డెడికేషన్: ఒకేసారి మూడు యూనిట్లతో 'ఫౌజీ' షూటింగ్.!

Aug 12, 2026 4:21PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన కమిట్‌మెంట్ అండ్ డెడికేషన్‌తో టాలీవుడ్‌లోనే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేస్తున్నారు. 'సీతా రామం' ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' సినిమా కోసం ప్రభాస్ చూపిస్తున్న డెడికేషన్ చూసి ఇండస్ట్రీ మొత్తం షాక్ అవుతోంది.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ పరిసరాల్లో ఏకంగా 3 వేర్వేరు యూనిట్లతో జరుగుతోంది. ప్రభాస్ ఒకే రోజులో రిహార్సల్స్, హెవీ యాక్షన్ సీక్వెన్స్, సెకండ్ యూనిట్ ప్యాచ్‌వర్క్ షూటింగ్‌లలో పాల్గొంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

షూటింగ్ ప్రారంభం కాగానే.. ఫస్ట్ యూనిట్ దగ్గర ప్రభాస్ రిహార్సల్స్‌లో పాల్గొంటున్నారు. యాక్షన్ సీన్స్ లేదా సంక్లిష్టమైన సీక్వెన్సెస్ పర్ఫెక్ట్‌గా రావడానికి మొదట రిహార్సల్స్ పూర్తి చేస్తున్నారు. ఆ తర్వాత ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా.. వెంటనే సెకండ్ సెట్‌లోకి వెళ్లి హై-వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్‌లో జాయిన్ అవుతున్నారు. ఇక ఆ ఫైట్ సీన్ల మధ్యలో లభించే చిన్న చిన్న విరామాలలో.. ప్యాచ్ వర్క్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.  అంటే ఒకే రోజులో రిహార్సల్స్, హెవీ యాక్షన్ స్టంట్స్, ప్యాచ్‌వర్క్.. ఇలా మూడింటినీ ప్రభాస్ సింగిల్ హ్యాండ్‌తో మేనేజ్ చేస్తున్నారు.

దీనికి తోడు, ఈ సినిమా వేగంగా పూర్తి కావడానికి ప్రభాస్ ఏకంగా నెల రోజుల డేట్స్‌ను నాన్‌స్టాప్‌గా కేటాయించారట. తన బాడీపై ఎంత స్ట్రెయిన్ పడుతున్నా, సినిమా అవుట్‌పుట్ పర్ఫెక్ట్‌గా రావాలనే ఒకే ఒక్క లక్ష్యంతో ప్రభాస్ పడుతున్న ఈ కష్టం చూసి యూనిట్ సభ్యులు సైతం ఫిదా అయిపోతున్నారు.

ఆజాద్ హింద్ ఫౌజ్ నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ డ్రామాలో ప్రభాస్ ఒక విప్లవాత్మక సైనికుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, ప్రభాస్ మేకోవర్ నెట్టింట ఏ స్థాయిలో రచ్చ చేశాయో తెలిసిందే. ఒకవైపు సెట్స్‌లో ఈ స్థాయిలో కష్టపడటం, మరోవైపు ప్రతి సీన్‌ని పర్‌ఫెక్ట్‌గా చెక్కడం చూస్తుంటే.. 'ఫౌజీ' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టించబోతోందో అర్థమవుతోంది.

 

 

Prabhas Dedication, Fauzi Movie, Shooting Update, Hanu Raghavapudi

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com