.jpg)
స్క్రిప్ట్ ఎంత బాగున్నా..సరే దానిలో తన మార్క్ కనబడే వరకు అస్సలు రాజీపడరని పవన్ కళ్యాణ్ గురించి ఇండస్ట్రీతో పాటు అభిమానులు అనుకునే మాట. ఎంత మంచి స్క్రిప్ట్ ఆయన దగ్గరకు తీసుకువెళ్లినా దానికి మార్పులు, చేర్పులు చేసేంతవరకు నిద్రపట్టదని అంటుంటారు. అప్పట్లో కొందరికి ఇది అనుభవం కూడా..ఇలా ప్రతి దానిలో వేలు పెట్టడం వల్ల చాలా సినిమాలు అట్టర్‌ఫ్లాప్ అయిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీనిపై సినిమాల్లో పవన్‌పై స్పూఫ్‌లు కూడా వచ్చాయి. దీనిని గుర్తించిన పవన్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ జోలికి వెళ్లడం తగ్గించడంతో అవి సూపర్‌హిట్ అయ్యాయి..కానీ చాలా రోజుల తర్వాత స్క్రిప్ట్ విషయంలో పవర్‌స్టార్ మళ్లీ తలదూర్చినట్లు ఫిలింనగర్‌లో చెవులు కొరుక్కుంటున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ ఆర్టీ నీసన్‌తో వేదాలం రీమేక్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు పవన్..తెలుగు నేటివిటీకి తగ్గట్టు పవర్‌ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి ఉత్సాహంగా దానిని పవన్ ముందు పెట్టాడట నీసన్..అయితే తనకు అంతగా స్క్రిప్ట్ నచ్చలేదని..కొన్ని మార్పులు సూచించాడట పవన్. అంతే ఎంత ఉత్సాహంగా లోపలికి వెళ్లాడో..అంతే నీరసంగా బయటకు వచ్చాడట నీసన్. ఈ వార్త తెలిసిన కొందరు సినీ జనాలు అబ్బే పవన్ ఇంకా మారలేదా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారట.






