Home

»

Latest News

త్రివిక్రమ్‌కు హ్యాండిచ్చిన సమంత

Oct 27, 2016 3:53PM

పవర్‌స్టార్ పవర్‌‌ఫుల్ యాక్టింగ్‌కు..త్రివిక్రమ్ పంచ్ పవర్‌కి ఇండస్ట్రీలో తిరుగులేదు. ఇప్పటి వరకు రెండుసార్లు జోడి కట్టిన ఈ జంట రెండుసార్లు సూపర్‌హిట్లు తన ఖాతాలో వేసుకుంది. ఈ సారి ముచ్చటగా మూడోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. "దేవుడే దిగి వచ్చినా" పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాను నవంబర్ 5న లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా సమంతను ఎంపిక చేశారని వార్తలు వెలువడ్డాయి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా సమంతకు చేరింది. మీరు పవన్‌తో సినిమా చేయబోతున్నారటగా అని ఒక అభిమాని ట్విట్టర్‌‌లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. తాను ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలో తప్ప ఏ తెలుగు  చిత్రంలోనూ నటించడం లేదని క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేసింది. ఈ స్టేట్‌మెంట్‌తో పవన్‌ పక్కన తాను నటించబోతున్నట్లు వస్తున్న వార్తలకు సమంత తెరదీంచినట్లైంది. అంతా బాగానే ఉంది కాని త్రివిక్రమ్ పరిస్థితి ఏంటి..?

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com