Home

»

Latest News

పవన్ ఇంటిముందు మహిళ ధర్నా..!

Sep 29, 2016 8:07PM

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కు సంబంధించిన ఏ న్యూస్ అయినా హాట్ టాపిక్కే, ఎందుకంటే ఆయనకున్న ఫాలోయింగ్ అలాంటిది. ఆ న్యూస్‌లో ఆయన ఇన్‌వాల్వ్‌మెంట్ ఉన్నా లేకున్నా..కనీసం పవన్ పేరుంటే చాలు అది పెద్ద బ్రేకింగ్ న్యూసై కూర్చుంటుంది. తాజాగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటిముందు ఒక అమ్మాయి బైఠాయించిదన్న వార్త ఉదయం నుంచి మీడియాలో హాట్ టాపిక్ అయింది. హైదరాబాద్ కొండాపూర్‌కు చెందిన మిరియాల జ్యోతి అనే మహిళ..జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లోని పవన్ ఇంటికి చేరుకుని తాను పవన్ వీరాభిమానిని అని చెప్పడమే కాకుండా తన సమస్యలు ఆయనకు చెప్పుకోవాలని వచ్చాని అంటోంది.

అక్కడితో ఆగితే పర్వాలేదు కానీ తాను పవన్‌ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పింది. అయితే ఆయన ఇంట్లో లేరని, నెల రోజుల వరకూ రారని సిబ్బంది చెప్పినా పట్టించుకోకుండా రోడ్డు మీదే కూర్చుంది. గత నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో పవన్ కళ్యాణ్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందిచడంతో వారు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె విషయం ఏమోగానీ ఈ వార్తను మీడియా మాత్రం బాగా వాడుకుంది.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com