Home

»

Latest News

సుమ సక్సెస్ అవుతుందా..?

Jul 12, 2016 11:39AM

పరిచయం అవసరం లేని పేరు సుమ. ఎంతటి స్టార్ హీరో లేదా హీరోయిన్ కైనా ఫలానా సినిమా హీరో అని పరిచయం చేస్తేనే కానీ గుర్తుపట్టనివారుంటారు కానీ.. సుమను, ఆమె గొంతును గుర్తుపట్టని తెలుగువారుండరు. అతిశయోక్తి అనిపించినా ఇది నిజం. టీవీలో వచ్చే షోలు మొదలుకొని ఆడియో ఫంక్షన్ల వరకూ అన్నిటిలోనూ సుమే కనిపిస్తుంటుంది. ఆ వాక్చాతుర్యానికి మహామహులు కూడా గమ్మునుండిపోతారు. అలాంటి సుమ ఇప్పుడు ట్రాక్ మార్చింది. యాంకరింగ్ చేసి చేసీ బోర్ కొట్టిందో ఏమో సింగర్ అవతారమెత్తింది. అయితే.. అది సినిమా కోసం కాదులెండి. ఓ ప్రముఖ చానల్ వారు నిర్వహిస్తున్న "సెల్ మీ ద ఆన్సర్" అనే రియాలిటీ షో కోసం సుమ సింగర్ గా మారి ఒక పాట పాడింది. రఘు కుంచె స్వర సారధ్యంలో రూపొందిన ఈ పాటను రవికాంత్ రాయగా.. సుమ పాడింది. త్వరలో మొదలుకానున్న ఈ షో ప్రారంభంలో ఈ పాటను ప్లే చేస్తారట. మరి సుమ కొత్త టాలెంట్ ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com