
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)పక్కన హీరోయిన్ గా ఛాన్స్ అంటే పెట్టి పుట్టాలనే సామెత ఇండస్ట్రీ వర్గాల్లో చాలా బలంగానే ఉంది. ఇప్పుడు ఈ అదృష్టం ఒకప్పుడు వరుస విజయాలతో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డేకి దక్కిందనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.
పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ కాంబోలో 'OG' (ఓజీ) సీక్వెల్ ‘ఓజీ 2’ (OG 2) తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. అనౌన్స్ మెంట్ వీడియో అయితే ఒక రేంజ్ లోనే వైరల్ గా మారింది. ఈ మూవీలోనే పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. దీంతో ఫస్ట్ టైమ్ పవన్ సరసన పూజా హెగ్డే జోడీ కట్టబోతుండటం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో హరీష్ శంకర్ చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్', అంతకుముందు క్రిష్ జాగర్లమూడి చిత్రాల్లోనూ పవన్ సరసన పూజ పేరు వినిపించినప్పటికీ, రకరకాల కారణాల వల్ల ఆ కాంబినేషన్ కుదరలేదు. అయితే ఈసారి డైరెక్టర్ సుజీత్ క్రియేట్ చేస్తున్న ‘ఓజీ యూనివర్స్’ లో ఈ బుట్టబొమ్మకి కు పక్కాగా స్థానం దక్కిందని టాక్ వినిపిస్తోంది. సుజీత్ ఇప్పటికే నేచురల్ స్టార్ నానితో 'బ్లడీ రొమియో' అనే క్రేజీ ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, నాని సినిమా కంటే ముందే పవన్ కళ్యాణ్ 'ఓజీ 2' ని సెట్స్‌పైకి తీసుకెళ్తారా, లేక షెడ్యూల్స్ మార్చుతారా అనేది తెలియాల్సి ఉంది.
Also read: Samantha: సమంత దెబ్బకి జేజెమ్మ రికార్డు గల్లంతు.. మా ఇంటి బంగారం అరుదైన రికార్డు
పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పై పవన్ నిర్మిస్తున్న ఓజి 2 పూజా హెగ్డేకి భారీ కమ్‌బ్యాక్ లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే పూజాని హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు అధికార ప్రకటన రానుందనేది ఇండస్ట్రీ తాజా టాక్.






