Home

»

Latest News

డ‌బుల్ హ్యాట్రిక్ బ్యూటీ పూజా హెగ్డే.. ఫ‌స్ట్ పాన్ - ఇండియా హిట్ కొట్టేనా?

Dec 1, 2021 9:57AM

`అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌`, `మ‌హ‌ర్షి`, `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్`, `హౌస్ ఫుల్ 4` (హిందీ), `అల వైకుంఠ‌పుర‌ములో`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్`.. ఇలా ఆరు వ‌రుస విజ‌యాల‌తో డ‌బుల్ హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది `బుట్ట‌బొమ్మ‌` పూజా హెగ్డే. ఈ నేప‌థ్యంలో.. ఆమె త‌దుప‌రి చిత్రం `రాధే శ్యామ్`పైనే అంద‌రి దృష్టి ఉంది.

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ పిరియ‌డ్ ల‌వ్ సాగా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న థియేట‌ర్స్ లోకి రాబోతోంది. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ భారీ బ‌డ్జెట్ మూవీ.. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా వినోదాలు పంచ‌నుంది. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. పూజా హెగ్డే కెరీర్ లో ఇదే తొలి పాన్ - ఇండియా మూవీ. మ‌రి.. ఆరు వ‌రుస విజ‌యాల‌తో మంచి జోష్ లో ఉన్న మిస్ హెగ్డే.. ఫ‌స్ట్ పాన్ - ఇండియా హిట్ కొట్టి మ‌రోసారి వార్త‌ల్లో నిలుస్తుందేమో చూడాలి.

కాగా, `జిల్` రాధాకృష్ణ డైరెక్ట్ చేసిన `రాధే శ్యామ్`లో `రెబ‌ల్ స్టార్` కృష్ణంరాజు ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. భాగ్య‌శ్రీ‌, జ‌య‌రామ్, జ‌గ‌ప‌తి బాబు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com