Home

»

Latest News

ప్యారడైజ్ చుట్టూ రాజకీయం: ఒక్క పూటలోనే సీన్ రివర్స్.!

Sep 24, 2026 1:00PM

‘ది ప్యారడైజ్’ సినిమాకు పెద్దగా ప్రమోషన్ ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేకుండానే.. తెలంగాణ రాజకీయ సోషల్ మీడియా ఈ సినిమాను విపరీతంగా వైరల్ చేసిందనే చర్చ మొదలైంది.

రిలీజ్‌కు ముందు తెలంగాణలో అధికార కాంగ్రెస్‌కు చెందిన సోషల్ మీడియా వర్గాల నుంచి సినిమాకు అనుకూలంగా పోస్టులు కనిపించగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ వర్గాల నుంచి నానికి వ్యతిరేకంగా కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. దీంతో సినిమా విడుదలకు ముందే ‘ప్యారడైజ్’ చుట్టూ రాజకీయ రంగు కనిపించింది.

అయితే సినిమా రిలీజ్ తర్వాత మాత్రం సోషల్ మీడియాలో సీన్ పూర్తి మారినట్టుగా కనిపిస్తోంది.

సినిమాలో ప్రియదర్శి పోషించిన ఎమ్మెల్యే శంకర్ అనే పాత్ర మాజీ సీఎం కేసీఆర్‌ను పోలి ఉందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. పైగా, "చావు నోట్లో తలపెట్టయినా మీకు గుర్తింపు తీసుకొస్తా" అనే డైలాగ్ కేసీఆర్ ఐకానిక్ స్పీచ్ ను గుర్తుచేస్తోంది. ఆ పాత్రలోని కొన్ని అంశాలు కేసీఆర్ గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

దీంతో సినిమా విడుదల తర్వాత కాంగ్రెస్ సోషల్ మీడియా నుంచి 'ప్యారడైజ్'కు మద్దతు కరువైంది. కొన్ని నెగెటివ్ పోస్ట్ లు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియా వర్గాలు మాత్రం సినిమాలోని ఆ పాత్రను తమకు అనుకూలంగా తీసుకుని పోస్టులు పెడుతున్నాయి. ముఖ్యంగా ‘That is KCR’ అంటూ సినిమాకు మరింత ప్రచారం కల్పించేలా పోస్టులు వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: టాప్‌లో నాని.. సూపర్ స్టార్ రికార్డును సమం చేసిన న్యాచురల్ స్టార్.!

ఒకవైపు కాంగ్రెస్ వర్గాల పోస్టులు.. మరోవైపు బీఆర్ఎస్ అనుకూల పోస్టులు.. మధ్యలో ‘ది ప్యారడైజ్’. ఇలా సినిమా విడుదలకు ముందు, విడుదల తర్వాత కూడా ఈ మూవీ రాజకీయ చర్చలోకి రావడం ఆసక్తికరంగా మారింది.

ఏది ఏమైనా.. ‘ది ప్యారడైజ్’కు రాజకీయ సోషల్ మీడియా ద్వారా వచ్చిన ప్రచారం మాత్రం సినిమాకు అదనపు బజ్ తీసుకొచ్చిందనే చెప్పాలి. సినిమా యూనిట్ ప్రమోషన్ కోసం ఎంత ఖర్చు చేసిందన్నది పక్కన పెడితే.. రాజకీయ పోస్టుల రూపంలో వచ్చిన ప్రచారం మాత్రం ఉచితంగానే వైరల్ అయిపోయింది.

మరి ఈ రాజకీయ చర్చ ‘ప్యారడైజ్’ సినిమాకు బాక్సాఫీస్ పరంగా ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

మీకు నచ్చవచ్చు:
సింహాద్రి 175 డేస్ రికార్డు.. ఎవరూ టచ్ చేయలేని రికార్డు సృష్టించిన ఎన్టీఆర్.!
ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి సాంగ్.. 33 ఏళ్ళయినా అదే మ్యాజిక్.!

 

 

 

[Paradise Movie Political Heat, Paradise KCR Role, The Paradise Movie Review, Nani Paradise Review, Paradise Public Talk, The Paradise Review, Natural Star Nani, Telugu Film News, Telugu News]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com