Home

»

Latest News

మోడీ.. సినిమా చూపెట్టాడంటోన్న సినిమా వాళ్లు

Nov 9, 2016 11:35AM

దేశ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయడంతో పాటు నల్లధనానికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాత రూ.500. రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ వార్తను టీవీల ద్వారానో వివిధ మార్గాల్లోనో తెలుసుకున్న జనం "నమో" జపం చేస్తున్నారు. ఈ లిస్ట్‌లో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఉన్నారు. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులు మోడీ నుంచి అనౌన్స్‌మెంట్ రాగానే మొబైల్ ఫోన్లకి పని చెప్పారు..ఆయన నిర్ణయాన్ని మెచ్చుకుంటూ ట్వీట్లు చేశారు. అవి మీ కోసం

రామ్‌గోపాల్ వర్మ:

 "మోడీ తీసుకున్న ఈ నిర్ణయానికి ఆయనకు హ్యాట్సాఫ్..నల్లధనం దాచుకున్న వారి ముఖాలు ఇప్పుడు ఎలా ఉంటాయో"


అల్లు అర్జున్:

"మోడీఫికేషన్ అనేది ఇప్పుడు పరాకాష్టకు చేరింది. "


అల్లు శిరీష్:

 "ప్రధాని మోడీ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు..ఈ నిర్ణయం నా కెంతో సంతోషాన్ని కలిగించింది జైహింద్"


కొరటాల శివ:

"స్వచ్ఛభారత్‌కు నిజమైన అర్థం ఇదే..క్లీన్ ఇండియా"


లావణ్య త్రిపాఠి:

"ప్రధాని నరేంద్రమోడీ అద్బుతమైన నిర్ణయం తీసుకున్నారు. దాచడానికి ఏం లేని వ్యక్తి దేనికీ భయపడడు కూడా..! "


మంచు విష్ణు:

"ఆ సమయంలో నేను ఢిల్లీలోనే ఉన్నాను. కానీ ప్రధాని నిర్ణయం వెనుక నా హస్తం లేదు"

మోహన్ బాబు:

"ఇవాళ నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నరోజు..ప్రధాని మోడీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆయనకు నా కృతజ్ఞతలు..ఆయనకు మాత్రమే అవినీతిని అంతం చేయగల తెగింపు ఉంది."

నాగార్జున:

"నేను పారీస్ నుంచి ట్వీట్ చేస్తున్నాను..నిజంగా పన్ను చెల్లించేవారికి ప్రధాని బహుమతినిచ్చారు..మీ అందరికి కంగ్రాట్స్..మనదేశం గొప్ప ఆర్థిక వ్యవస్థగా మారే రోజు దగ్గర్లోనే ఉంది."

 

రామ్:

"నాకు తెలిసి ఇదే నిజమైన స్వచ్ఛభారత్ మిషన్..ఇండియాని మోడీ అంతర్గతంగా శుద్ధిచేస్తున్నారు."

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com