Home

»

Latest News

కన్నడలోకి పెళ్లిచూపులు

Nov 24, 2016 11:14AM


భారీ బడ్జెట్ సినిమాలే నాలుగు రోజులు ధియేటర్లో నడవడానికి నానా తిప్పలు పడుతుంటే..చాలా చిన్న బడ్జెట్‌తో తెరకెక్కి భారీ లాభాలతో ఈ ఏడాది బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలిచింది పెళ్లిచూపులు..ఈ సినిమాను వివిధ భాషల్లోకి రీమేక్ చేయడానికి చాలా మంది ముందుకొచ్చారు. తాజాగా కన్నడిగులు ఈ లిస్ట్‌లో ఫస్ట్ నిలిచినట్లు ఫిల్మ్‌నగర్ టాక్. తెలుగులో విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా నటించగా కన్నడలో గురునందన్, శ్రద్ధా శ్రీనాథ్‌లు హీరో హీరోయిన్లుగా నటించనున్నట్లు సమాచారం. అలాగే తెలుగులో దాస్యం తరుణ భాస్కర్ దర్శకత్వం వహించగా..కన్నడలో మురళీ డైరెక్ట్ చేస్తారని శాండిల్‌వుడ్ టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com