Home

»

Latest News

Peddi: బాక్సాఫీస్ వద్ద పెద్ది అరాచకం..మూడో వారంలో చరణ్ సంచలనం

Jun 22, 2026 6:28PM

మెగా పవర్ స్టార్  రామ్ చరణ్(Ram charan)వన్ మాన్ షో  'పెద్ది'(peddi)తగ్గేదేలే అనే విధంగా విడుదలైన 18 రోజులు గడుస్తున్నా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సరికొత్త సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. సాధారణంగా ఏ సినిమాకైనా మూడో వారం వచ్చేసరికి కలెక్షన్ల జోరు కొంత వరకు  తగ్గుతుంది. కానీ 'పెద్ది' విషయంలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ చరణ్ కి బాక్సాఫీస్ వద్ద ఉన్న స్టామినాకి నిదర్శనంగా భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. నిన్న ఒక్క రోజే ప్రముఖ ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ 'బుక్ మై షో'లో ఏకంగా 50 వేల టికెట్లు అమ్ముడవడం చూస్తుంటే ఈ సినిమా రేంజ్ ఏంటో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

 థియేటర్లలో అదనంగా జోడించిన సరికొత్త సీన్లు ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో సినిమాను ఇప్పటికే చూసిన అభిమానులు, సాధారణ ప్రేక్షకులు సైతం ఆ కొత్త సీన్లని  వెండితెరపై చూసి ఎంజాయ్ చేయడానికి 'రిపీట్ ఆడియన్స్' గా మళ్లీ మళ్లీ థియేటర్ల మెట్లు ఎక్కుతున్నారు. 18వ రోజున ఏకంగా 44.6% భారీ గ్రోత్ నమోదుతో  ఆదివారం నాడే ఇండియా వ్యాప్తంగా 2.82 కోట్ల నెట్ వసూళ్లని  సాధించి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. దీనికి ముందు రోజు శనివారం నాడు 1.95 కోట్ల నెట్ సాధించిన ఈ చిత్రం, ఆదివారం సెలవు దినాన్ని పూర్తిగా క్యాష్ చేసుకుంది.  


Also read: Rajasekhar: అన్నయ్య ఎప్పుడు వస్తాడు.. రాజశేఖర్ అంటే అంతే మరి  

ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 400 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. మూడో వీకెండ్‌లోనూ అదే జోరును ప్రదర్శిస్తూ దూసుకుపోతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో  అరాచకం సృష్టిస్తోంది. ఆదివారం ఒక్క రోజే ఈ రెండు రాష్ట్రాల నుండి 2.75 కోట్ల గ్రాస్ రావడం గమనార్హం. కర్ణాటకలో 25 లక్షలు సాధించింది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com