Home

»

Latest News

Peddi Movie Review In Telugu: పెద్ది మూవీ రివ్యూ

Jun 4, 2026 12:44AM

 

-సినిమా పేరు: పెద్ది 
-న‌టీన‌టులు:  రామ్ చరణ్, జాన్వీ కపూర్, శృతి హాసన్, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యెందు శర్మ, బొమన్ ఇరానీ, అజయ్ ఘోష్ తదితరులు   
-సినిమాటోగ్ర‌ఫీ: ఆర్. రత్నవేలు 
-ఎడిటింగ్: నవీన్ నూలి
-మ్యూజిక్: ఏ ఆర్ రెహ్మాన్ 
-నిర్మాత‌లు: వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా 
-బ్యానర్స్: వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, ఐవివై   
-రచన,దర్శకత్వం: బుచ్చిబాబు సాన
- రిలీజ్ డేట్: జూన్ 4  2026 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రీమియర్స్ నుంచే పెద్దితో వరల్డ్ వైడ్ గా ల్యాండ్ అయ్యాడు. ప్రచార చిత్రాల ద్వారా అభిమానులు, మూవీ లవర్స్, సినీ వర్గాల్లో పెద్దిపై  పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడ్డాయి. మరి చరణ్ కెరీర్ లోనే మోస్ట్ ప్రెస్టేజియస్ట్ గా కూడా గుర్తింపు పొందిన పెద్ది ఎలా ఉందో చూద్దాం.

కథ

పెద్ది(రామ్ చరణ్) ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం దగ్గరలోని అడవుల్లో ఒక కొండ కింద ఉండే గ్రామంలో ఉంటాడు. గ్రామం అనే కానీ పేరు ఉండదు. బతకడం కోసం చిన్న చిన్న పనులు చేసుకునే పెద్ది ఆట కూలీగా క్రికెట్ ఆడుతుంటాడు. ఆడటమే కాదు ప్రతి బంతికి సిక్సర్లు కొట్టడంలో స్పెషలిస్ట్. చాలా మంది పెద్ది పై పందాలు కూడా కడుతుంటారు. అలాంటి పెద్ది క్రికెట్ ని వదిలి ప్రాణాలని, జీవితాన్ని పణంగా పెట్టి కుస్తీ నేర్చుకుంటాడు. పెద్ది క్రికెట్ ని వదిలి కుస్తీ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? నేర్చుకునే సమయంలో పెద్దికి శత్రువులు ఏర్పడితే వాళ్ళు ఎవరు? పెద్దికి కుస్తీ నేర్పింది ఎవరు? కుస్తీ తోనే తన ఆట ఆపాడా? లేక మరో ఆట కూడా ఆడాడా? ఆడితే ఆ ఆట ఏంటి?  ఈ కథలో  మిగతా క్యారక్టర్ ల తీరు ఏంటి? అసలు పెద్ది లక్ష్యం ఏంటి? అది సాధించాడా లేదా అనేదే పెద్ది.

ఎనాలసిస్ 
 ప్రచార చిత్రాలతో పెద్ది కథ పలానా విధంగా ఉండబోతుందని ఆడియెన్స్ ఉహించుకున్నారో  పెద్ది అలాగే ఉంది. కానీ బుచ్చిబాబు అత్యద్భుతంగా తెరకెక్కించాడు. చరణ్ పెర్ ఫార్మెన్స్ ప్రధాన హైలెట్. వన్ మాన్ షో అని చెప్పవచ్చు. జాన్వీ క్యారక్టరయిజేషన్ ఇంకొంచం ఉంటే బాగుండేది. పైగా క్యారక్టర్ తీరుతెన్నులు ఓవర్ డోస్ అనిపించాయి. రెహ్మాన్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్స్ లెంట్.  సినిమా ప్రారంభమే బిస్వాన్ అనే స్పోర్ట్స్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ రావడం, పెద్ది గురించి  ఒక గ్రామస్థుడు 
 బిస్వాన్ కి చెప్పడంతో మంచి క్యూరియాసిటీ ఏర్పడింది. చరణ్ ఇంట్రడక్షన్ సూపర్.  పెద్ది, రామ్ బుజ్జి, అచ్చాయమ్మా తో వచ్చిన  సీన్స్ బాగున్నాయి.

అప్పల సూరి క్యారక్టర్ లక్ష్యం, అందుకు చూపించే  తాపత్రయం టోటల్ ఫస్ట్ హాఫ్ కే హైలెట్.. అప్పలసూరి, పెద్ది మధ్య ఇంకొంచం  బాండింగ్ ఎస్టాబ్లిష్ చెయ్యాల్సింది. ఎంటర్ టైన్ మెంట్ ని కూడా మరింతగా ఎస్టాబ్లిష్ చెయ్యాల్సింది. ఇంటర్వెల్ ఎపిసోడ్ పెద్ద కిక్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ లో పెద్ది కుస్తీ ఎపిసోడ్ సూపర్. గౌరు నాయుడుతో వచ్చిన సీన్స్ తో పాటు పోటీల సీన్స్ బాగున్నాయి. ఇంకా కుస్తీనే కదా ఉందనుకునే టైంలో పెద్ది తీసుకున్న ఒక నిర్ణయం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్ గా పెద్ది చుట్టూనే నడుస్తుంది. చివరి పావుగంట మూవీ ఒక రేంజ్ లో ఉంది.. క్లైమాక్స్ సూపర్


నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు 

పెద్దిగా చరణ్ పెర్ఫార్మ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మూవీ మొత్తాన్ని మెస్మరైజ్ చేసే పెర్ఫార్మ్ తో ఒంటి చేత్తో నడిపించాడు. అచ్చాయమ్మాతో వచ్చే లవ్ సీన్స్ , సాంగ్స్ ,డాన్స్ . క్రికెట్, కుస్తీ, రెజ్లింగ్  సీన్స్ లో  చరణ్ పెర్ఫార్మ్ నభూతో నభవిష్యత్తు . నిజంగానే మన దేశం తరుపున ఒలింపిక్స్ కి పంపిస్తే చరణ్ గెలవడం ఖాయమని అనిపించాడు. క్లైమాక్స్  సీన్ లో అయితే ఏడిపించేసాడు. చరణ్ కెరీర్ లోనే పెద్ది పెర్ఫార్మ్  ఒక మెయిల్ స్టోన్ గా నిలబడుతుంది.  అచ్చాయమ్మా గా జాన్వీ అత్యద్భుతమైన పెర్ఫార్మ్ కనపరిచింది. పక్క విలేజ్ అమ్మాయి క్యారక్టర్ లో ఒదిగిపోయింది. గౌరు నాయుడు గా శివరాజ్ కుమార్ పెర్ఫార్మ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన క్యారక్టర్ ఔన్నత్యం యొక్క మొత్తాన్ని కళ్లతోనే చెప్పాడు. అసలు ఆ క్యారక్టర్ కి శివరాజ్ కుమార్ ని తప్ప మరొకర్ని ఊహించలేం. అప్పలసూరి గా చేసిన జగపతిబాబు కూడా అంతే. తెలుగు సినిమాకి దొరికిన ఎంత వాల్యుబుల్ ఆర్టిస్ట్ నో మరోమారు చెప్పాడు.అవార్డు తీసుకొచ్చే పెర్ఫార్మ్.  రామ్ బుజ్జిగా దివ్యెందు శర్మ పర్ఫెక్ట్ గా సూటయ్యాడు.  నాచురల్ పెర్ఫార్మ్ తన స్టైల్ అని మరో సారి చాటి చెప్పాడు. తెలుగులో మరిన్ని అవకాశాలు రావచ్చు. మిగతా రోల్స్ లో చేసిన వాళ్ళందరూ కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి  పెద్దికి మరింత వన్నె తెచ్చారు. రత్నవేలు ఫొటోగ్రఫీ పెద్దికి మరింత ఎసెట్ అయ్యింది. మన కళ్ళ ముందు జరుగుతున్న కథ అని మనకి అనిపించేలా ఫొటోగ్రఫీ ఉండటం  రత్నవేలు స్పెషల్. ఎడిటింగ్,యాక్షన్ సీక్వెన్స్ కూడా సూపర్ ఉన్నాయి. బుచ్చిబాబు దర్శకుడిగా, రచయితగా నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యాడు. ప్రతి షాట్ ని అత్యద్భుతంగా తెరకెక్కిస్తూ కథనాన్ని నడిపిన స్పీడ్ కి హాట్స్ హాఫ్ చెప్పవచ్చు .చరణ్ చెప్పినట్టుగా  అగ్ర దర్శకుడిగా నిలబడటం ఖాయం. వృద్ధి బ్యానర్ నిర్మాణ విలువలు  ఒక రేంజ్ లో ఉండటమే కాదు  పెద్ది అదనపు బలంగా  నిలిచాయి.

 

బలాలు
1 .కథ, 
2 . చరణ్ పెర్ ఫార్మెన్స్ 
3 . కుస్తీ పోటీలు 
4 .సాంగ్స్ 
5. అప్పల సూరి క్యారక్టర్ 
6 . ప్రీ క్లైమాక్స్ 
7 . క్లైమాక్స్ 
8 .డైరెక్షన్ 

బలహీనతలు 
1 . జాన్వీ కపూర్ క్యారక్టర్ ని కొంచం ఓవర్ గా చూపించడం
2 . రచన పరంగా మరింత శ్రద్ద వహించకపోవడం

 

చివరిగా చెప్పుకోవాలంటే పెద్ది పక్కా రామ్ చరణ్ వన్ మాన్ షో

రేటింగ్ 2 .75 / 5                                                                              అరుణాచలం

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com