Home

»

Latest News

Peddi: ఓటిటి డేట్ పై ఇంట్రెస్టింగ్ బజ్.. ఫస్ట్ వీక్ రికార్డు కలెక్షన్స్  

Jun 11, 2026 2:29PM

 


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)కట్ అవుట్ కి ఉన్న చరిష్మాని మరోసారి నిరూపిస్తు పెద్ది(Peddi)రికార్డుల కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.  జూన్ 4 న థియేటర్స్ లోకి అడుగుపెట్టిన పెద్ది ప్రీమియర్స్ తో కలుపుకొని తొలి వారానికి 345 కోట్లకి పైగా గ్రాస్ తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ స్టేటస్ సాధించాలంటే 400 కోట్ల నుండి 425 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లని లేదా  220 కోట్ల నెట్ వసూళ్లని పెద్ది రాబట్టాల్సి ఉంటుంది. మరి  ప్రస్తుత రన్‌  చూస్తుంటే, అతి త్వరలోనే ఆ మైలురాయిని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

పెద్ది ఓటీటీ హక్కులని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు సొంతం చేసుకుంది. అన్ని దక్షిణ భారత భాషలతో పాటు హిందీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రూ. 105 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించినట్లు సమాచారం. ఈ సినిమా జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల అంచనా. అయితే, బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ కొనసాగితే, థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాతే అధికారిక స్ట్రీమింగ్ తేదీని ప్రకటిస్తారు. ఓటిటి ప్రేమికులకి గుడ్ న్యూస్ ఏంటంటే కట్ చేసిన సన్నివేశాలు కూడా పెద్దిలో ఉందనున్నట్టుగా టాక్. 

Also read: శ్మశానంలో 6 అడుగులే నా ఆస్తి.. ప్రముఖ హీరోయిన్ వ్యాఖ్యలు వైరల్ 
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com