Home

»

Latest News

Peddi: ఓటీటీలో పెద్ది గ్రాండ్ ఎంట్రీ.. ఇంత ఫాస్ట్‌గా ఎందుకో తెలుసా!

Jun 16, 2026 3:15PM

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)తన వన్ మాన్ షో పెద్ది(Peddi)తో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. ప్రెజెంట్ 400 కోట్ల క్లబ్ లో చేరి మరిన్ని కలెక్షన్స్ వసూలు చేసే దిశగా వెళ్తుంది. 1980ల నాటి రూరల్ ఆంధ్రా నేపథ్యంలో, గ్రామీణ ప్రజల ఆత్మగౌరవం, క్రీడల చుట్టూ తిరిగే ఈ భావోద్వేగ పాయింట్ కి ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతున్నారు. దేనోడు దానికే ఉంటాడనే రీతిలో పెద్ది ఓటిటిలోకి ఎప్పుడు వస్తుందా అని ఓటీటీ ప్రియులు  ఎదురుచూస్తు వస్తున్నారు.  

ఈ క్రమంలోనే 'పెద్ది' సినిమా డిజిటల్ రైట్స్‌కి  సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. అన్ని భాషల (తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం) డిజిటల్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 105 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని చెల్లించి డీల్ కుదుర్చుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.  సాధారణంగా పెద్ద సినిమాలకి  థియేట్రికల్ విడుదలకి, ఓటీటీ స్ట్రీమింగ్‌కి  మధ్య ఆరు నుండి పదివారాల పీరియడ్ ఉంటుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పెద్ది జూలై మధ్యలో లేదా ఆగస్టు మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం థియేటర్లలో రన్ విజయవంతంగా కొనసాగుతుండటంతో, కలెక్షన్ల జోరు తగ్గిన తర్వాతే డిజిటల్ రిలీజ్ డేట్‌ అధికారికంగా ప్రకటించనున్నారు.

also read: పాప్ సింగర్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిన మాజీ ప్రధాని.. వీడియోస్ వైరల్ 

మరోవైపు ఈ సినిమా ఓటీటీ వెర్షన్‌పై ఆసక్తికరమైన సర్ప్రైజ్ ప్రచారం సాగుతోంది. థియేట్రికల్ రన్‌లో డిలీట్ చేసిన సీన్లని (జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించి రెండు సీన్లు, జగపతి బాబుకి  సంబంధించిన ఒక సీన్) యాడ్ చేసి ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ని  ప్రదర్శిస్తున్నారు. దీనివల్ల కథలోని ఎమోషన్స్ ప్రేక్షకులకి మరింత బాగా కనెక్ట్ అవుతాయని మేకర్స్ భావిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, స్టార్ కాస్ట్ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించిన ఈ స్పోర్ట్స్ డ్రామా డిజిటల్ స్క్రీన్‌లపై ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. 



 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com