మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ , బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'పెద్ది'. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం నుండి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీనియర్ వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబు అత్యంత కీలకమైన క్యారెక్టర్ రోల్‌లో నటిస్తున్నారు. సినిమాలో కథను ఊహించని మలుపు తిప్పే 'అప్పలసూరి' అనే పవర్‌ఫుల్ పాత్రలో ఆయన కనిపించబోతున్నారు. తాజాగా ఈ క్యారెక్టర్‌కు సంబంధించి జగపతిబాబు డబ్బింగ్ చెబుతున్న ఒక సాలిడ్ వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది.
డబ్బింగ్ థియేటర్ లో జగపతిబాబు ఒక ఎమోషనల్ సీన్‌కి డైలాగులు చెబుతూ ఆ పాత్రలో పూర్తిగా లీనమైపోయారు. ఆయన గంభీరమైన వాయిస్ బేస్, డైలాగ్ డెలివరీ చూస్తుంటే థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పలసూరిగా జగపతిబాబు చేసిన పర్ఫార్మెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని ఈ వీడియో స్పష్టం చేస్తోంది.
గతంలో రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ 'రంగస్థలం' చిత్రంలో జగపతిబాబు పోషించిన 'ఫణీంద్ర భూపతి' పాత్ర ఎంతటి ప్రభావాన్ని చూపిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న 'పెద్ది' మూవీలోని అప్పలసూరి క్యారెక్టర్ ఆ ప్రెసిడెంట్ పాత్రను మించిపోయేలా అత్యంత రా అండ్ రస్టిక్‌గా ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ డబ్బింగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. మెగా అభిమానులతో పాటు సినిమా లవర్స్ కూడా ఈ వీడియోపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. జగపతిబాబు నటనకు, బుచ్చిబాబు టేకింగ్‌కు ఈ సినిమాతో మరో నేషనల్ అవార్డు ఖాయమంటూ నెటిజన్లు హంగామా సృష్టిస్తున్నారు. భారీ అంచనాల నడుమ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను కొల్లగొడుతుందో చూడాలి!






