Home

»

Latest News

Peddi: ‘పెద్ది’ మూవీ ఫస్ట్ రివ్యూ.. మూడు గంటల ఊర మాస్ జాతర.. పూనకాలు గ్యారెంటీ!

May 20, 2026

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న రస్టిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటకు సర్వం సిద్ధం చేసుకుంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ చిత్రం, తాజాగా తన సెన్సార్ ఫార్మాలిటీస్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది.

ఇక ఈ సినిమా రన్‌టైమ్‌ను మేకర్స్ 3 గంటల (180 నిమిషాలు) నిడివితో లాక్ చేశారు. సాధారణంగా కమర్షియల్ సినిమాలకు మూడు గంటల నిడివి అంటే కాస్త రిస్క్ అనుకుంటారు. కానీ, సెన్సార్ స్క్రీనింగ్ ముగిసిన తర్వాత ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న ఇన్‌సైడ్ రిపోర్ట్స్ వింటే మెగా అభిమానులకు పూనకాలు రావడం ఖాయమనిపిస్తోంది. ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించినట్లు సమాచారం.

ఈ చిత్రంలో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని విధంగా ఒక పవర్‌ఫుల్ రస్టిక్ మాస్ అవతార్‌లో అలరించబోతున్నారు. ఒక అథ్లెట్ తన ఉనికి కోసం, అంతకంటే పెద్ద ఆశయం కోసం చేసే పోరాటమే ఈ సినిమా కథ. సినిమాలో వచ్చే ఇంటర్వెల్ బ్లాక్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు, విలేజ్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయని టాక్. ముఖ్యంగా బుచ్చిబాబు డిజైన్ చేసిన చివరి 50 నిమిషాల క్లైమాక్స్ ఎపిసోడ్స్ అత్యంత ఎమోషనల్‌గా, గుండెల్ని పిండేసేలా హార్ట్ బ్రేకింగ్‌గా ఉంటాయని తెలుస్తోంది.

గత ఐదు నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ సరైన భారీ కమర్షియల్ సక్సెస్ లేక తీవ్ర కరువును ఎదుర్కొంటోంది. అయితే ఇప్పుడు ‘పెద్ది’కి వస్తున్న పాజిటివ్ సెన్సార్ రిపోర్ట్స్ చూస్తుంటే.. థియేటర్ల యజమానులకు, ఇండస్ట్రీకి పట్టిన ఈ కలెక్షన్ల కరువు పూర్తిగా తీరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, జాన్వీ కపూర్ గ్లామర్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లనున్నాయి.

వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంపై అంచనాలు ఇప్పుడు స్కై హైకి చేరాయి. జూన్ 4న థియేటర్లలో రామ్ చరణ్ బాక్సాఫీస్ ఊచకోత ఎలా ఉండబోతుందో చూడాలి!

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com