Home

»

Latest News

Peddi: 24 గంటల్లో హెల్లాల్లల్లో సాంగ్ వ్యూస్ రికార్డు ఇదే.. మరి థియేటర్స్ లో ఎలా ఉంటుందో 

May 25, 2026 8:39AM

 


మొన్న 23 న భూపాల్ సాక్షిగా పెద్ది(Peddi)నుంచి 'హెల్లాల్లల్లో'(Hellallallo)సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. అలా విడుదలైందో లేదో రికార్డులే నా చిరునామా అంటూ యూట్యూబ్ లో  రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. దీంతో పెద్ది పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు వేరు 'హెల్లాల్లల్లో' వచ్చాక అంచనాలు వేరు అనేలా ఉంది పరిస్థితి.


కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 18 మిలియన్లకి  పైగా వ్యూస్‌ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక ప్రాంతీయ సినిమా నుంచి వచ్చిన  సాంగ్ హిందీ, సౌత్ భాషల యూట్యూబ్ ట్రెండింగ్స్ లో అగ్రస్థానంలో నిలవడం పెద్ది స్టామినా ఈ పాటిదో తెలియచేస్తుంది. అనంత శ్రీరామ్ స్వర రచనలో రాగా తెలుగు వర్షన్ కి  రక్షిత సురేష్ తన వాయిస్‌తో మరింత ఎనర్జీని తీసుకొచ్చాడు. ఆస్కార్ అవార్డు గ్రహీత, మ్యూజిక్ లెజెండ్ ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ఈ 'హెల్లాల్లల్లో' పాట మెగా అభిమానులకి   మాస్ ఆడియన్స్‌కు ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్‌లా నిలిచింది. రామ్ చరణ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అందించిన అదిరిపోయే హుక్ స్టెప్స్‌కి  రామ్ చరణ్ తనదైన శైలిలో అద్భుతమైన గ్రేస్‌తో స్టెప్పులేశారు. గ్లామరస్ బ్యూటీస్ శృతి హాసన్, జాన్వీ కపూర్  ఇద్దరూ  చరణ్‌తో కలిసి స్క్రీన్‌ను షేర్ చేసుకుంటూ తమ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులని కట్టిపడేశారు. అందుకే రికార్డు వ్యూస్. మరి పల్లెటూరి జాతర నేపథ్యంలో కలర్‌ఫుల్ విజువల్స్, అడిక్టివ్ మాస్ బీట్స్ ,ఫోక్ ఎనర్జీతో ఉన్న ఈ సాంగ్ రేపు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.

 అదే టైంలో  ముందు ముందు 'హెల్లాల్లల్లో' రికార్డ్స్ ఎలా ఉంటాయో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న పెద్దికి బుచ్చిబాబు దర్శకుడు అనే విషయం తెలిసిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com