
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)వన్ మాన్ షో, మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'పెద్ది'(Peddi)జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తూ సోషల్ మీడియాని ఊపేస్తోంది. రీసెంట్ గా మేకర్స్ మెగా అభిమానులకి, మాస్ ఆడియన్స్‌కి మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. శృతిహాసన్ తో చరణ్ చేస్తున్న స్పెషల్ సాంగ్ ప్రోమోని మేకర్స్ కాసేపటి క్రితమే రిలీజ్ చేసారు.
'హెల్లాళ్లాలో'అనే లిరిక్ తో స్టార్ట్ అయిన సాంగ్ ప్రోమో విజువల్స్ చూస్తుంటే థియేటర్లలో మెగా ఫ్యాన్స్, మాస్ ఆడియెన్స్ కి పూనకాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. 1980ల నాటి రస్టిక్ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో, భారీగా వేసిన కలర్‌ఫుల్ జాతర సెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన ఊరమాస్ బీట్స్, డ్రమ్స్ అండ్ ఫోక్ మిక్సింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ వింటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఈ ప్రోమోలో రామ్ చరణ్ ఊరమాస్ లుక్‌లో వేసిన గ్రేస్ ఫుల్ మాస్ స్టెప్పులు అయితే మరో లెవల్. శ్రుతి హాసన్ కూడా తన అల్ట్రా-మాస్ లుక్ ,ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్‌తో స్క్రీన్‌పై విజువల్ ట్రీట్ ఇచ్చింది. ఆ ఇద్దరి కెమిస్ట్రీ, గ్రేస్ 2026లోనే 'హెల్లాళ్లాలో'ని బిగ్గెస్ట్ చార్ట్‌బస్టర్ గా నిలబెట్టేలా ఉన్నాయి.
Also read: Ramayana: రామాయణ థియేట్రికల్ హక్కుల రేటు చూసి షాక్ అవుతున్న స్టార్ డిస్ట్రిబ్యూటర్స్
ఈ స్పెషల్ సాంగ్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. గతంలో ఈ ప్రత్యేక గీతం షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఒక భారీ సెట్ నిర్మించినప్పటికీ, సరైన హీరోయిన్ ఖరారు కాకపోవడంతో షూటింగ్ కాస్త ఆలస్యమైంది. దర్శకుడు బుచ్చిబాబు(Buchibabu)ఎంతో పట్టుబట్టి, ఈ హై-వోల్టేజ్ నంబర్ కోసం శ్రుతి హాసన్ ని ఫైనలైజ్ చేశారు. కేవలం ఈ ఒక్క పాట కోసమే కోట్లాది రూపాయల బడ్జెట్ కేటాయించి, వందలాది మంది డ్యాన్సర్లతో అత్యంత గ్రాండ్‌గా షూట్ చేసినట్లు టాక్.ఇక సదరు సాంగ్ రేపు రిలీజ్ కానుంది. ఇప్పటి వరకు రిలీజైన రెండు సాంగ్స్ కి కోరియోగ్రఫీ అందించిన జానీ మాస్టర్ నే 'హెల్లాళ్లాలోకి కూడా అందించడం విశేషం.






