
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వన్ మాన్ షో 'పెద్ది' బాక్స్ ఆఫీస్ వద్ద తన జైత్రయాత్రని కొనసాగిస్తూ వస్తుంది. కేవలం 14 రోజుల్లోనే ఒరిజినల్ తెలుగు వెర్షన్‌లో ఏకంగా 200.48 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. టాలీవుడ్ చరిత్రలోనే ఒరిజినల్ లాంగ్వేజ్‌లో 200 కోట్ల క్లబ్‌లో చేరిన 9వ చిత్రంగా పెద్ది నిలిచింది. నిర్మాత అధికారికంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటేసిందని ప్రకటించారు. 2026 సంవత్సరానికి గానూ హయ్యెస్ట్ గ్రాసింగ్ సౌత్ ఇండియన్ సినిమాగా ‘పెద్ది’ సరికొత్త చరిత్ర లిఖించింది. ఇంతటి భారీ సంచలనాలు సృష్టిస్తున్నప్పటికీ, ఈ సినిమా టాలీవుడ్ టాప్ రికార్డు అయిన ‘దేవర’ మార్కును అందుకోవడంలో మాత్రం వెనుకబడిపోయిందనే విశ్లేషణలు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర: పార్ట్ 1’ చిత్రం ఇండియా వ్యాప్తంగా 292.47 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద ఒక బెంచ్‌మార్క్ సెట్ చేసింది. రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం రెండు వారాల్లో భారతదేశం మొత్తం మీద 225.52 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించినప్పటికీ, దేవర లైఫ్ టైమ్ ఇండియన్ నెట్ రికార్డును దాటడం ఇప్పుడు కొంచెం కష్టంగానే కనిపిస్తోంది. మొదటి వారంలో 193.55 కోట్లు సాధించి ఊపు చూపించిన పెద్ది, రెండో వారంలో కాస్త నెమ్మదించింది. రెండో వారం శనివారం 8.10 కోట్లు, ఆదివారం 9.20 కోట్లు రాబట్టినా, సోమవారం వచ్చేసరికి 4.10 కోట్లకు, మంగళవారం 3.45 కోట్లకు పడిపోయింది. ఈ డ్రాప్స్ కారణంగా దేవర సృష్టించిన సునామీ కలెక్షన్ల రికార్డును అందుకోలేక, ఒక సువర్ణావకాశాన్ని పెద్ది మిస్ చేసుకుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also read: వారణాసిపై నెట్ ఫ్లిక్స్ అధికారి కీలక వ్యాఖ్యలు.. భవిష్యత్తులోనే సర్ప్రైజ్






