
- ఆర్ఎక్స్ 100 , మంగళవారం సినిమాలతో పాయల్ సంచలనం
-పర్సనల్ వీడియోస్ సోషల్ మీడియాలో హల్ చల్
-అభిమానుల హడావిడి
'ఆర్ఎక్స్ 100 ' మూవీతో యూత్ మొత్తం తన గురించి మాత్రమే ఆలోచించేలా చేసిన ఢిల్లీ భామ 'పాయల్ రాజ్ పుత్'(Payal Rajput). ఆ తర్వాత కొన్ని బడా, చోటా చిత్రాలు చేసినా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. మళ్ళీ 'మంగళవారం' మూవీలో శైలుగా ఒక రేంజ్ పెర్ఫార్మ్ తో తన గోల్ రీచ్ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది యువత మంగళవారాన్ని థియేటర్స్ లో చూసిన తర్వాత పాయల్ కోసం మళ్ళీ ఫోన్స్ లో చూసిన వాళ్ళు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇంట్లో వాళ్ళు తిడతారని దుప్పటి కప్పుకొని మరి చూశారంటే పాయల్ ప్రభావాన్ని అర్ధం చేసుకోవచ్చు ఇప్పుడు వాళ్లందరికీ మరోసారి ఆ పని కల్పించింది. మ్యాటర్ ఏంటో చూద్దాం.
ఇనిస్టాగ్రమ్ లో పాయల్ యాక్టీవ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా పాయల్ తన స్టాఫ్ తో కలిసి ఉన్న కొన్ని పిక్స్ ని షేర్ చేసింది. అవి పిక్స్ అనుకుంటే పొరపాటు. పాయల్ చిలిపి అల్లరికి రహదారి. ఒక వీడియోలో తన డ్రస్సు నలిగిపోయి ఉండటంతో డ్రెస్ ఛేంజ్ చేసుకోకుండానే, అంటే సదరు డ్రెస్ ఒంటిపై ఉండగానే తన టీమ్ మెంబర్‌తో ఐరన్ చేయించుకుంటూ కనిపించింది. మరో వీడియోలో పొట్టి డ్రస్ ధరించి, మేకప్ చేయించుకుంటూనే తన డ్రస్‌ని సర్దుకుంటూ ఫుల్ కామెడీ పండించింది. మరి ఈ రెండు వీడియోస్ కనిపిస్తే పాయల్ అభిమాన భక్తులు సైలెంట్ గా ఉంటారా!, చూపులతో గుచ్చి గుచ్చి చంపకు, ఏ చిలిపి కళ్ళలోన లయవో అని పాడుకుంటూ పాయల్ కోసం సింగర్స్ గా మారిపోయారు. కామెంట్స్ కైతే లెక్కేలేదు.
పాయల్ ప్రెజెంట్ సినీ జర్నీ విషయానికి వస్తే ఇటీవల తమిళంలో లెజెండ్ శరవణన్ సరసన 'లీడర్' చిత్రంలో మెరిసింది. ప్రస్తుతం తన ఖాతాలో గోల్ మాల్ అనే మరో తమిళ చిత్రంతో పాటు కిరాతక అనే తెలుగు సినిమా ఉంది. మరి ఈ రెండు చిత్రాల ద్వారా తన అభిమాన భక్తులని, ప్రేక్షక దేవుళ్ళని మరింతగా అలరించాలని కోరుకుందాం. ఆ సత్తా పాయల్ కి ఉంది.






