మహేశ్ తో పాయల్ రొమాన్స్?
on Oct 12, 2021
`ఆర్ ఎక్స్ 100`తో తెలుగు తెరపైకి దూసుకొచ్చిన అందం.. పాయల్ రాజ్ పుత్. మొదటి తెలుగు చిత్రంతోనే సంచలనం సృష్టించిన ఈ సొగసరి.. ఆపై `వెంకిమామ`లో విక్టరీ వెంకటేశ్ కి జోడీగా, `డిస్కోరాజా`లో మాస్ మహారాజా రవితేజకి జంటగా కనువిందు చేసింది. ప్రస్తుతం ఓటీటీ చిత్రాలతో, మీడియం బడ్జెట్ మూవీస్ తో కాలం గడుపుతున్న పాయల్ కి.. తాజాగా ఓ బిగ్ టికెట్ ఫిల్మ్ లో నటించే ఛాన్స్ దక్కిందట.
ఆ వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం విదితమే. `అతడు`, `ఖలేజా` తరువాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ థర్డ్ జాయింట్ వెంచర్ ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా, ఇందులో ఇద్దరు నాయికలకు స్థానమున్నట్లు సమాచారం. ఇప్పటికే మెయిన్ లీడ్ గా `బుట్టబొమ్మ` పూజా హెగ్డే ఎంపిక కాగా, సెకండ్ లీడ్ గా పాయల్ రాజ్ పుత్ ని ఎంచుకున్నట్లు బజ్. అదే గనుక నిజమైతే.. పాయల్ కి ఇది బంపర్ ఆఫరే. త్వరలోనే మహేశ్ - త్రివిక్రమ్ చిత్రంలో పాయల్ ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
మరి.. ఈ సినిమాతోనైనా పాయల్ రాజ్ పుత్ స్టార్ లీగ్ లో చేరుతుందేమో చూడాలి.