
సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలోని హీరోలందరితో పనిచేశాడు. అయితే ఇప్పుడు ఆయనకు ఉన్న కోరిక తీరబోతుంది. అదేంటనుకుంటున్నారా.. ఇప్పటివరకూ అందరితో సినిమాలు చేశాడు కానీ.. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయలేదు. ఇప్పుడు ఆ లోటు కూడా తీరబోతుంది. త్వరలో థమన్ పవన్ సినిమాకు సంగీతం అందిచనున్నారు. ఈ విషయాన్ని ఎవరో కాదు స్వయంగా థమనే చెప్పాడు. ‘పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ తర్వాతి సినిమాకు నేను సంగీత దర్శకుడినం’టూ సోమవారం అర్ధరాత్రి ప్రకటించాడు థమన్. ఇక పవన్ సినిమాకు ఛాన్స్ కొట్టేసినందుకు థమన్ చాలా కుషీగా కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. మరి అన్ని సినిమాలకు థమన్ మ్యూజిక్ ఒకేలా ఉంటుంది అన్న అపవాదును పక్కన బెట్టి ఈసారి ఎలాంటి మ్యూజిక్ అందిస్తాడో చూడాలి మరి.
కాగా పవన్ ఏఎం రత్నం నిర్మాతగా నీశన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకే థమన్ సంగీత దర్శకుడిగా ఫిక్స్ అయ్యాడు.






