
పవన్ కల్యాణ్ త్రివిక్రమ్ ఇద్దరూ జాన్ జిగురు దోస్త్‌లే. పవన్ గురించి మాట్లాడుకొనేటప్పుడు త్రివిక్రమ్ గురించీ, త్రివిక్రమ్ ప్రస్తావన వచ్చినప్పుడు పవన్ గురించీ మాట్లాడుకోక తప్పదు. ఇద్దరి కాంబోలో... జల్సా, అత్తారింటికి దారేది సినిమాలొచ్చాయి. రెండూ సూపర్ డూపర్ హిట్లే. ఇప్పుడు హ్యాట్రిక్ సినిమా రాబోతోంది. అ.ఆ తరవాత త్రివిక్రమ్ మరో సినిమా చేయలేదు. ఆఫర్లు వచ్చినా పవన్ కోసం డిసెంబరు వరకూ ఆగడానికి డిసైడ్ అయిపోయాడు. వీరిద్దరి కాంబోలో మూడో సినిమా డిసెంబరు నుంచీ పట్టాలెక్కుతుందని కూడా చెప్పుకొన్నారు. అయితే మధ్యలో ఏమైందో.. ఆ సినిమాని పక్కన పెట్టేసినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. పవన్‌కీ, త్రివిక్రమ్‌కీ మధ్యలో కమ్యునికేషన్ గ్యాప్ వచ్చిందని, అందుకే... ఇద్దరి మధ్యా ఇప్పుడు మాటల్లేవని, ఆ కారణంతోనే సినిమా పక్కన పెట్టేశారని చెబుతున్నారు. పవన్ స్క్రిప్టుని పక్కన పెట్టిన సూర్య.. మరో హీరో తో సంప్రదింపులు జరుపుతున్నాడని టాక్. ఈ విషయం తెలుసుకొన్న పవన్ సడన్ గా నేసన్‌ని రంగంలోకి దించి కొత్త సినిమాకి శ్రీకారం చుట్టించాడని గుసగుసలాడుకొంటున్నారు. దాంతో త్రివిక్రమ్ - పవన్ లసినిమా షెడ్డుకెళ్లిందని... ఈ ప్రాజెక్టుని పూర్తిగా పక్కన పెట్టేశారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్రాణానికి ప్రాణంగా కలసి మెలిసి ఉండే ఈ స్నేహితుల మధ్య అంత కమ్యునికేషన్ గ్యాప్ ఏమొచ్చిందబ్బా? అంటూ పవన్ అభిమానులు ఇప్పుడు చర్చించుకొంటున్నారు. కారణం వాళ్లిద్దరికే తెలియాలి మరి.






