
సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ తర్వాత ఫ్యాన్స్‌కి మళ్లీ పవర్ ప్యాక్ లాంటి సినిమా ఇవ్వాలనుకున్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు అన్ని ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. తనకు ఖుషి లాంటి హిట్ ఇచ్చిన తమిళ దర్శకుడు ఎస్‌జె సూర్య దర్శకత్వంలో ఓ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు పవన్. ఫ్యాక్షన్ డ్రాప్‌తో పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మాతగా భారీగా తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. అయితే దర్శకుడు సూర్యకు నటుడిగా వరుస అవకాశాలు వస్తుండటంతో పవన్ సినిమా నుంచి తప్పుకున్నారు.
దీంతో సూర్యకు బదులుగా గోపాల గోపాల ఫేం డాలీకి దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు పవన్. ఎస్‌జె సూర్య ఫ్రీ ప్రొడక్షన్ పనులు మధ్యలోనే ఆపేయడంతో డాలీ మొదటి నుంచి మొదలెట్టాల్సి వచ్చింది. దీనికి మరింత సమయం పట్టేలా ఉంది. అయితే డిసెంబర్ నుంచి త్రివిక్రమ్ సినిమాకు పవన్ ఓకే చెప్పాడు. అంటే ఐదు నెలల కాలంలో డాలీ ఈ సినిమా పూర్తి చేయాలి. పవన్ సినిమా పూర్వవ్వాలంటే మినిమమ్ సంవత్సరం పడుతుంది..సో డాలీ సినిమా కోసం త్రివిక్రమ్ సినిమాను కొంచెం ఆపాలి. లేదంటే త్రివిక్రమ్ కోసం డాలీ సినిమాను పక్కన బెట్టాలి. దీనిపై పవన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడట..మరి పవర్ స్టార్ ఏ సినిమాను పక్కన బెడతాడో వేచి చూడాలి.





