Home

»

Latest News

పవన్ పాడిన పాట సర్దార్ సినిమాలో లేదా...?

Apr 3, 2016 3:05PM

సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోతోంది. సర్దార్ గురించి చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వేగంగా పాకిపోతోంది. లేటెస్ట్ గా సర్దార్ గురించి మరో పుకారు షికారు చేస్తోంది. సినిమాలో పవన్ పాడిన పాటను పెట్టలేదని, కొన్ని రోజుల తర్వాత యాడ్ చేసి, సినిమా మైలేజ్ ను పెంచే ఆలోచనలో మూవీ టీం ఉందనే మాట వినిపిస్తోంది. పైగా స్విస్ లో షూటింగ్ చేసుకొచ్చిన పాటలకు కూడా సెన్సార్ చేయించాల్సి ఉండటంతో, ఈ పాటను పక్కన పెట్టే అవకాశం ఉందట. రెండో వారంలో గానీ, మూడో వారంలో గానీ పవన్ పాడిన పాటను సినిమాలో యాడ్ చేస్తారని సమాచారం. సినిమా జస్ట్ యావరేజ్ టాక్ వచ్చినా రికార్డులన్నింటినీ తిరగరాయడం ఖాయం. పవన్ సినిమాలకు ఇలాంటి స్టంట్స్ అవసరమే లేదు. కాకపోతే, ఎలాగూ టైం లేదు కాబట్టి దీన్నే తన పబ్లిసిటీకి అనుకూలంగా మార్చుకున్నాడన్నమాట సర్దార్..

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com