Home

»

Latest News

వర్మకి పవన్ కౌంటర్ ఇచ్చారా..?

Mar 21, 2016 3:23PM

రాంగోపాల్ వర్మ పవన్ కాళ్యాణ్ ను పొగుడుతూనే.. లేదా కాస్త ఎటకారంగో తన ట్విట్టర్ ఆయుధం ద్వారా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. లేటెస్ట్ గా సర్దార్ గబ్బర్ సింగ్ గురించి కూడా కామెంట్స్ విసిరాడు రాంగోపాల్ వర్మ. బాలీవుడ్లో రిలీజ్ చేయడం గురించి ఆలోచించాలని.. బాహుబలి సినిమాలో విషయం ఉన్నట్టు ఈ సినిమాలో కూడా విషయం ఉంటేనే అక్కడ రిలీజ్ చేయాలి అంటూ ట్వీటాడు. మరి రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలకు పవన్ సమాధానం ఇచ్చారా.. అంటే తాను స్పీచ్ ను బట్టి చూస్తే కాస్త వర్మకు సమాధానం ఇచ్చినట్టే అర్ధమవుతోంది. నిన్న సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. చివర్లో.. కథాంశం చతీస్ గడ్, మనకు దగ్గరకగా ఉండే కథ కాబట్టి ఈ సినిమాను సునీల్ లుల్లాగారు హిందీలో రిలీజ్ చేస్తామన్నారు. అంతే తప్పు ఏ సినిమాకు పోటీగా ఆలోచించలేదు అంటూ ముగించారు. మరి బాహుబలికి తమ సినిమా పోటీ కాదని వర్మకి పవన్ ఈ రకంగా సమాధానం చెప్పినట్టే కనిపిస్తోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com