Home

»

Latest News

పవన్ కళ్యాణ్ హీరోగా రాజు సుందరం సినిమా

Jun 4, 2011 12:32PM

పవన్ కళ్యాణ్ హీరోగా రాజు సుందరం సినిమా ఉంటుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే గతంలో డ్యాన్సర్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించి, కొరియోగ్రాఫర్ గా మారి, ప్రస్తుతం దర్శకుడిగా మారిన రాజు సుందరం తొసారిగా తమిళంలో అజిత్‍ హిరోగా, నయనతార హీరోయిన్ గా నటించిన "ఏగన్" అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కమర్షియల్ గా అంత పెద్ద విజయం సాధించకపోయినా, దర్శకుడిగా రాజు సుందరానికి ఫిలిం క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలను సంపాదించి పెట్టింది. అలాంటి రాజు సుందరం ప్రస్తుతం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఒక చక్కని కథ వినిపించాడట.

ఆ కథ నచ్చిన పవర్ స్టార్ ఆ సినిమాకి ఒ.కె.చెప్పారట. ఈ సినిమాకి స్క్రిప్ట్ ని "ఖుషి, నాని, కొమరం పులి" వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు యస్.జె.సూర్య అందించటం విశేషం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విష్ణువర్థన్ దర్శకత్వంలో, నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ సంయుక్తంగా సంఘమిత్ర, అర్కా మీడియా పతాకాలపై నిర్మిస్తున్న "ది షాడో" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. దీని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో "గబ్బర్ సింగ్" (హిందీ "దబాంగ్" రీమేక్) సినిమాలో నటిస్తారు. అది పూర్తవగానే 2012 మొదట్లో రాజు సుందరం దర్శకత్వంలోని సినిమా ప్రారంభం అవుతుందట.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com