Home

»

Latest News

ఇండస్ట్రీ వైపు కన్నెత్తి చూడొద్దు.. వైసీపీ, మోహన్ బాబుపై పవన్ సంచలన వ్యాఖ్యలు!

Sep 26, 2021 10:29AM

సినీ పరిశ్రమ వైపు కన్నెత్తి  చూస్తే ఊరుకునేది లేదని ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీని పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ హెచ్చరించారు. సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన 'రిపబ్లిక్‌' సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ కు పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

సాయి తేజ్‌ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో రూపొందిన సినిమా 'రిపబ్లిక్'. అక్టోబర్‌ 1న విడుదల ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌ లో జరిగింది. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయి తేజ్ ప్రస్తుతం హాస్పిటల్ లో ఉండటంతో.. ఈ మూవీ ప్రమోషన్ బాధ్యతను మెగా ఫ్యామిలీ తీసుకుంది. ఈ మూవీ ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయగా.. ఇక తాజాగా జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్ కు పవన్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అయితే ఈ ఈవెంట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

"తేజ్‌ హై స్పీడ్‌తో వస్తున్నాడని అందుకే యాక్సిడెంట్‌ అయిందని కొందరు తప్పుగా కథనాలు అల్లారు. సినిమాల వాళ్లు కూడా మనుషులే. మా మీద కొంచెం కనికరం చూపించండి. ఇలాంటి సమయంలో మాట్లాడాల్సింది తేజ్‌ కి జరిగిన ప్రమాదం గురించి కాదు. వైఎస్‌ వివేకానందరెడ్డి ఎందుకు హత్యకు గురయ్యారు?.. కోడి కత్తితో ఒక నాయకుడిని పొడవడం వెనకున్న కుట్ర.. ఆరేళ్ల చిన్నారిపై జరిగిన దారుణం.. ఇలాంటి వాటి మీద కథనాలు ఇవ్వండి." అని పవన్ అన్నారు.

ఏపీ ప్రభుత్వ విధానాలను పవన్ తప్పుబట్టారు. తనపై ఉన్న కోపాన్ని.. చిత్ర పరిశ్రమపై చూపొద్దన్నారు. కోపముంటే తన సినిమాలు ఆపండన్న పవన్.. తన వాళ్లను మాత్రం వదిలెయ్యండని వ్యాఖ్యానించారు. ప్రైవేట్ పెట్టుబడితో సినిమాలు చేస్తే ఈరోజు గవర్నమెంట్ కంట్రోల్ చేస్తా అంటుంది. మేం సినిమా తీస్తే.. టిక్కెట్లు మీరు అమ్ముతారా? ఇదేం విధానం అంటూ ఫైర్ అయ్యారు. ప్రతీసారి సినిమా వాళ్ల జోలికి రావొద్దు. ముఖ్యంగా వైసీపీ నాయకులు సినిమా ఇండస్ట్రీ వైపు కన్నెత్తి చూడొద్దు.. కాలిపోతారు అని అన్నారు. 

ఏపీలో చిత్రపరిశ్రమ పట్ల జరుగుతున్న అంశాలపై మోహన్ బాబు స్పందించాలని పవన్ డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కుటుంబీకులు మీ బంధువులు కదా. కావాలంటే పవన్ కళ్యాణ్‌ ను బ్యాన్ చేసుకోండి. చిత్రపరిశ్రమ జోలికి మాత్రం రావొద్దు అని మీరు వైసీపీ పెద్దలకు చెప్పండి. ఇవాళ చిత్రపరిశ్రమకు అమలు చేసిన చేసిన రూల్స్‌.. రేపటి రోజున మీ విద్యానికేతన్ స్కూళ్లకు కూడా అప్లై చేయొచ్చు. ఈ విషయాన్ని గుర్తెరిగి స్పందించండి అంటూ పవన్ సంచలన కామెంట్స్ చేశారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com