నితిన్ కు పవన్ బాగా కలిసొచ్చాడు..!
on Jun 3, 2016
అవును. నితిన్ కు పవన్ కళ్యాణ్ బాగా కలిసొచ్చాడు. వరస ఫ్లాపుల్లో, తన సినీ కెరీర్ ఐసియూలో ఉన్న సమయంలో చివరి ఆశగా, ఇష్క్ సినిమా తీసిన నితిన్, ఆ సినిమా ఆడియోకు పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించాడు. సినిమా సూపర్ హిట్టవ్వాలని, నితిన్ కు మూవీ టీం కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు పవర్ స్టార్. ఇక ఇష్క్ తర్వాత నితిన్ కెరీర్ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. తాజాగా, రెండు డల్ సినిమాలతో, మరో భారీ హిట్ కొట్టాల్సిన అవసరంలో ఉన్న నితిన్, మరోసారి పవన్ గోల్డెన్ లెగ్ మీద ఆధారపడ్డాడు. అ..ఆ ఆడియోకు పవన్ ను ఆహ్వానించాడు. ఆడియో ఫంక్షన్ కు వచ్చి విష్ చేయడంతో పాటు, తన తోటలో పండిన మామిడిపళ్లను నితిన్ కు గిఫ్ట్ గా పంపి మరీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు పవర్ స్టార్. ఈ సారి కూడా నితిన్ గురి తప్పలేదు. విడుదలైన మొదటి రోజే, ఆ ఆ సూపర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ టాక్ కంటిన్యూ అయితే, మూవీ నితిన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా మారే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ పండితులు. మొత్తమ్మీద ఇక నుంచి తన సినిమా ఆడియో ఫంక్షన్ కు పవర్ స్టార్ వస్తే, ఆ సినిమా సూపర్ హిట్టే అని ఫిక్సైపోయాడు నితిన్.