
పవన్ కళ్యాణ్, వర్మ.. ఇలాంటి వారంటే సోషల్ మీడియా జనాలకి భలే పిచ్చా! వాళ్ల గురించి ఏం రాసినా, ఏం కూసినా లైక్లు, షేర్లు, కామెంట్లు తెగ వచ్చి పడిపోతాయి. అందుకే, పవర్ స్టార్ యొక్క గొప్ప మనస్సు, ఆయన యొక్క పేద పరిస్థితి అంటూ పోస్టులు బయలుదేరాయి ఈ మధ్య! ఆయన తన ఫేవరెట్ కార్ ను అమ్మేశాడని వాటి సారాంశం... ఇంకేముంది, హద్దుపొద్దూ లేని బోలెడన్ని బే'కార్' బాతాకానీలు గుప్పుమన్నాయి... పవన్ కళ్యాణ్ కాదు ప్యాకేజీ కళ్యాణ్ అంటూ సెటైర్లు వేసే వారికి ఈ కార్ అమ్ముడు ఎసిపోడ్ వాడుకుని రిటార్డ్ ఇచ్చారు పవనిస్టులు. తమ హీరో ప్యాకేజ్ లకు అమ్ముడుపోయే వాడైతే కార్ ఎందుకు అమ్ముకుంటాడని ప్రశ్నించారు. సదరు కాస్ట్ లీ కార్ చిన్న పిల్లల గుండె బబ్బుల వైద్యం కోసం అమ్మేశాడని హ్యూమన్ టచ్ కూడా ఇచ్చారు!
పవర్ స్టార్ అభిమానుల పవర్ ఫుల్ పోస్టులకి అంతే ఘాటుగా విమర్శలు , వెటకారాలు కూడా ఎదురయ్యాయ మరి కొంత మంది నెటిజన్స్ వద్ద నుంచీ. పవన్ కళ్యాణ్ కార్ విషయంలో ఇంత బేకార్ బాతాఖానీ జరుగుతున్నా పవర్ స్టార్ మాత్రం అసలు విషయం ఏంటో చెప్పలేదు. చెప్పడు కూడా. సోషల్ మీడియాలో మాత్రం గబ్బర్ సింగ్ గారి కార్ గబ్బు గబ్బు అయిపోయింది! అఫ్ కోర్స్... పవర్ స్టార్ పాప్యులర్టీ పవర్ అలాంటిది మరి...





.jpg)
