Home

»

Latest News

పవన్ హీరోగా బివియస్ యన్ ప్రసాద్ చిత్రం

Jun 10, 2011 3:34PM

పవన్ హీరోగా బి.వి.యస్.యన్.ప్రసాద్ చిత్రం నిర్మించబోతున్నారని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, గతంలో ప్రభాస్ హీరోగా ఛత్రపతి, డార్లింగ్ వంటి సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత బి.వి.యస్.యన్.ప్రసాద్ ఒక సినిమాని నిర్మించబోతున్నారని సమాచారం. ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ టర్న్డ్ రాజు సుందరం దర్శకత్వం వహిస్తారనీ, ప్రముఖ దర్శకుడు యస్.జె.సూర్య ఈ సినిమాకి స్క్రిప్ట్ ను అందిస్తున్నారట.

ఈ సినిమాని నిర్మాత బి.వి.యస్.యన్.ప్రసాద్ రానున్న నవంబర్ నెలలో ప్రారంభించి, 2012 వేసవి శలవుల కానుకగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు విష్ణువర్థన్ దర్శకత్వంలో, నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ సంయుక్తంగా నిర్మిస్తున్న"ది షాడో" అనే సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు. దీని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో, గణేష్ నిర్మించబోయే "గబ్బర్ సింగ్" సినిమాలో నటిస్తారు. ఈ రెండు సినిమాలూ పూర్తయ్యాక రాజు సుందరం దర్శకత్వంలో, పవన్ కళ్యాణ్ హీరోగా, బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మించే సినిమా నవంబర్ లో ప్రారంభమవుతుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com