Home

»

Latest News

ప్యారడైజ్ లో ఎన్టీఆర్, చరణ్,అల్లు అర్జున్ చేసి ఉంటే: జరిగేది అదే..స్టార్ నటుడి  వ్యాఖ్యలు వైరల్! 

Nov 14, 2026 4:38PM


సినీ సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ట్రాక్ రికార్డుకి ఘనమైన హిస్టరీ నే ఉంది. రైటర్స్ కి స్టార్ డమ్, విజిల్స్, చప్పట్లు తెచ్చిన కట్ అవుట్ కూడా. నటుడుగాను రాణించి అబ్బా మనం వెళ్లే మూవీలో పరుచూరి గోపాల కృష్ణ ఉంటే ఎంత బాగుండని అనుకునేలా కూడా చేసాడు.

 తాజాగా పరుచూరి పలుకులు ప్రోగ్రాంలో  'ది ప్యారడైజ్' సినిమాపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ, ఈ కథాంశంపై మరింత శ్రద్ధ పెట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కథల ఎంపిక, నటీనటుల ఎంపిక ఎంత ముఖ్యమో ఆయన తనదైన శైలిలో వివరించారు.

మూవీ  విషయంలో మరికొంత జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేదని, కంటెంట్ పరంగా ఇంకా మెరుగైన అవుట్‌పుట్ వచ్చే అవకాశం ఉండేదని ఆయన విశ్లేషించారు. ఒక మంచి పాయింట్‌ను తీసుకున్నప్పుడు దానిని తెరపై ఆవిష్కరించే విధానంలో చిన్నపాటి మెరుగులు దిద్దితే ప్రేక్షకుల నుంచి మరింత స్పందన లభిస్తుందని  పేర్కొన్నారు.

ఇక ఇదే సందర్భంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోల గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు ప్యారడైజ్  కథలో చేసి  ఉంటే సినిమా స్థాయి పూర్తిగా వేరేలా ఉండేదని, అగ్ర హీరోల బాడీ లాంగ్వేజ్, వారి మాస్ ఇమేజ్, బాక్సాఫీస్ స్టామినా ఈ రకమైన కథలకు సరిగ్గా సరిపోతాయని అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి: బిగ్గెస్ట్ అనౌన్స్ మెంట్: ఎన్టీఆర్, అనిల్ రావిపూడి క్రేజీ కాంబో ఫిక్స్..ఇక థియేటర్లలో నవ్వుల జాతరే!

తెలుగు తెరపై ఇలాంటి వైవిధ్యమైన ప్రయత్నాలు వస్తున్న తరుణంలో, కథాబలం తోడుగా అగ్ర హీరోల భాగస్వామ్యం ఉంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తారుమారవుతాయని  ఉద్ఘాటించారు.

సినిమా నిర్మాణంలో ప్రతి విభాగంపై తగినంత దృష్టి పెట్టడం వల్ల భవిష్యత్తులో మరింత సంచలన విజయాలు సాధించే అవకాశం ఉంటుందని కూడా మేకర్స్ కి కూడా  సూచించారు.

 

మీకు నచ్చవచ్చు: అమితాబ్ ఆస్థి గొడవలో ట్విస్ట్: అడ్డం తిరిగిన ఆ మహిళ!
మీకు నచ్చవచ్చు:ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ చిత్రంలో ఎన్టీఆర్!

 

[Paruchuri Gopala Krishna, Ntr, Ram Charan, Allu Arjun, Nani, The Paradise]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com