Home

»

Latest News

చిరంజీవితో మూవీ అనగానే రోజా రియాక్షన్: రకరకాల కూరగాయలు ఉంటాయి కానీ, రకరకాల కులాలు ఉండవు!

Nov 18, 2026 1:26PM

 

మెగాస్టార్ చిరంజీవి, అగ్ర రచయిత 'పరుచూరి బ్రదర్స్' కి మధ్య సినిమాల పరంగాను, వ్యక్తిగతంగానూ మంచి అనుబంధం ఉంది. ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఆ కాంబోలో వచ్చాయి. అలాంటి ఎన్నో చిత్రాల్లో ఒక చిత్రం ముఠామేస్త్రి.


1993 జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ఈ సినిమా, శతదినోత్సవం జరుపుకోవడమే కాకుండా మ్యూజికల్ హిట్‌గానూ నిలిచింది. ఇప్పుడు ఈ అపురూప దృశ్యకావ్యం మరోసారి నవంబర్ 22న   రీ-రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమాకు సంబంధించిన నాటి షూటింగ్ అనుభవాలను, ఆసక్తికరమైన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

చిరంజీవి మేస్త్రి స్థాయి నుంచి మంత్రి స్థాయి వరకు తన అద్భుతమైన నటనతో ఏ విధంగా ప్రాణం పోశారో ఆయన వివరించారు.   ఈ చిత్రంలో నటి రోజా కీలక పాత్రలో నటించగా, ‘సర్పయాగం’ తర్వాత ఆమెకు ఈ సినిమాలో అవకాశం దక్కింది. సెట్‌లోకి వెళ్లిన తొలి రోజుల్లో చిరంజీవితో కలిసి నటించాల్సి రావడంతో రోజా ‘డాడీ డాడీ’ అంటూ తన చేయి పట్టుకుని ఎంతో టెన్షన్ పడ్డారని, మెగాస్టార్‌లాంటి పెద్ద హీరో పక్కన నటించే అవకాశం రావడంతో ఆమె కళ్లలో ఆనందం స్పష్టంగా కనికట్టించిందని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. 

ఇక ముఠామేస్త్రి ఘన విజయం సాధించడంలో విషయంలో పరుచూరి డైలాగ్స్ సంభాషణలు చాలా కీలకం. ముఖ్యంగా “ఇక్కడ రకరకాల కూరగాయలు ఉంటాయి కానీ.. రకరకాల కులాలు ఉండవు. ఉన్నది ఒక్కటే కులం లేబర్‌ కులం” లాంటి శక్తివంతమైన డైలాగులను మెగాస్టార్ నోట చెప్పించగా, థియేటర్లలో ప్రేక్షకులు ఈలలు వేసి హోరెత్తించారు.

ఇది కూడా చదవండి: చరిత్ర సృష్టించిన మయసభ: IFFI నామినేషన్ దక్కించుకున్న తొలి తెలుగు వెబ్ సిరీస్!

అదేవిధంగా “టోపీ పెట్టని మహమ్మదీయుడిని, బొట్టుపెట్టని హిందువుని, సిలువ వేయని క్రైస్తవుడిని..” అనే అద్భుతమైన డైలాగ్‌తో హీరో అన్ని మతాలను తనవేనని చాటుకుని ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.   “న్యాయం కోసం పోరాడుతుంటే.. పోలీసులు ఇచ్చిన బహుమతి” అంటూ పోలీసుల తీరును సున్నితంగా ఎండగట్టిన తీరు ప్రేక్షకులను ఆలోచింపచేస్తుంది.రాజ్  కోటి సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు, చిరంజీవి వేసిన మాస్ స్టెప్పులు అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించాయి. చిత్రంలోని క్లైమాక్స్ సన్నివేశం ప్రేక్షకులని మరో లెవల్‌కి  తీసుకెళ్తుంది.


కేవలం హీరో పాత్రే కాకుండా, విలన్ రోల్ కి  సైతం అత్యంత బలమైన సంభాషణలు రాసారు.మీనా, రోజాలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నాటి రాజకీయ వాతావరణాన్ని, సామాజిక అంశాలను మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ రూపంలో తెరకెక్కించిన ఈ దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి ప్రతిభ అమోఘం. ప్రస్తుతం 4K క్వాలిటీతో వస్తున్న ఈ సినిమా రీ-రిలీజ్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

మీకు నచ్చవచ్చు: ఓం' ఫస్ట్ రివ్యూ!
మీకు నచ్చవచ్చు:ఆకాశంలో ఒక తార ఫస్ట్ రివ్యూ

 

[Chiranjeevi, Paruchuri Gopala Krishna,Roja,Kondandarami reddy, meena, Mutamestri]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com