Home

»

Latest News

ఎన్టీఆర్‌కు షాకిచ్చిన బాలీవుడ్ భామ‌

Nov 5, 2015 8:58AM

ఎన్టీఆర్ సినిమా అంటే ఏక‌థానాయిక అయినా ఎగిరి గంతేస్తుంది. కాల్షీట్లు ఎన్ని కావాలీ... అంటూ తొంద‌ర‌పెడుతుంది. అయితే ఇదంతా ఇక్క‌డ‌. బాలీవుడ్ లో అంత సీన్ లేద‌ని ప‌రిణీతీ చోప్రా నిరూపించింది. ఎన్టీఆర్ సినిమాలో న‌టిస్తారా అని అడిగితే ''అబ్బే సౌత్ ఇండియ‌న్ సినిమాల‌పై నాకంత ఇంట్ర‌స్ట్ లేదు.. చేయాల‌నీ లేదు. నిజానికి అంత టైమ్ లేద‌''ని గొప్ప‌లు పోతోంది.

ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్ లో ఓ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి జ‌న‌తా గ్యారేజ్ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఇందులో క‌థానాయిక‌గా బాలీవుడ్ భామ ప‌రిణీతీ చోప్రాని ఎంచుకొన్నార‌న్న ప్ర‌చారం సాగింది. అయితే ప‌రిణీతీ మాత్రం ఈ ఆఫ‌ర్ ఒప్పుకోలేద‌ట‌. `బాలీవుడ్‌లో ఊపిరి స‌ల‌ప‌నంత బిజీగా ఉన్నా.. ఇప్పట్లో సౌత్ ఇండియ‌న్ సినిమాల్లో న‌టించ‌లేను` అని తేల్చి చెప్పేసిన‌ట్టు టాక్‌. దాంతో.. చిత్ర‌బృంతం గ‌తుక్కుమంద‌ట‌. ఎన్టీఆర్ సినిమా అంటే ఎగురుకొంటూ వ‌స్తుంద‌నుకొంటే.. అంత షాక్ ఇచ్చిందేంటి???  అంటూ షాకైపోతున్నారు.

ఇక్క‌డే ఖాళీగా ఉన్న ఏ స‌మంత‌నో, కాజ‌ల్‌లో వెదుక్కొంటే స‌రిపోతుంది లే అని డిసైడ్ అయ్యార‌ట‌. ఒక‌ట్రెండు రోజుల్లో క‌థానాయిక ఎంపిక‌పై ఓ అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com