
ఒక సినిమా కోసం ఎంత కష్టపడి షూటింగ్ చేసినా.. ఫైనల్ అవుట్‌పుట్ అనేది పోస్ట్ ప్రొడక్షన్‌లోనే తేలుతుంది. ముఖ్యంగా ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, డీఐ, విజువల్ ఎఫెక్ట్స్ వంటి పనులకు తగినంత సమయం కేటాయించాల్సి ఉంటుంది. కానీ రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఈ పనులను హడావుడిగా పూర్తి చేస్తే.. ఆ ప్రభావం చివరికి థియేటర్‌లో కనిపించే అవుట్‌పుట్‌పై పడుతుంది.
తాజాగా ‘ది ప్యారడైజ్’ విషయంలోనూ ఇదే తరహా విమర్శలు వినిపిస్తున్నాయి. సినిమాలో ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్ విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయనే అభిప్రాయాలు ప్రేక్షకుల నుంచి వస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో నేరేషన్‌కు, సౌండ్‌కు మధ్య సరైన బ్యాలెన్స్ లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
‘ప్యారడైజ్’ షూటింగ్‌కు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చాలా సమయం తీసుకున్నారనే విషయం తెలిసిందే. భారీ స్కేల్‌లో సినిమాను తెరకెక్కించడంతో షూటింగ్ దశలోనే ఎక్కువ సమయం వెళ్లిపోయింది. దాంతో రిలీజ్ డేట్ దగ్గర పడే సమయానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుకున్నంత సమయం దొరకలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఒక సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ అనేది చిన్న విషయం కాదు. షూటింగ్ పూర్తయిన తర్వాత ఎడిటింగ్‌లో కథను మరింత టైట్ చేయడం.. అవసరం లేని సన్నివేశాలను తొలగించడం.. సౌండ్ ఎఫెక్ట్స్‌ను పర్ఫెక్ట్‌గా సెట్ చేయడం.. డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మధ్య సరైన బ్యాలెన్స్ తీసుకురావడం.. ఇవన్నీ ఫైనల్ అవుట్‌పుట్‌ను మార్చగలవు.
ముఖ్యంగా భారీ యాక్షన్ సినిమాల విషయంలో సౌండ్ మిక్సింగ్‌కు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. స్క్రీన్‌పై యాక్షన్ ఎంత బాగా కనిపించినా.. దానికి తగ్గ సౌండ్ ఇంపాక్ట్ లేకపోతే ప్రేక్షకుడికి ఆ సీన్ ఇచ్చే ఎక్స్‌పీరియన్స్ తగ్గిపోతుంది.

ఇది కూడా చదవండి: గ్లోబల్ స్టార్ బాలయ్య.. ‘భగవంత్ కేసరి’ క్లిప్‌తో ట్రంప్‌ను ట్రోల్ చేసిన ఇరాన్.!
ఇటీవల టాలీవుడ్‌లో కొన్ని సినిమాల విషయంలో ఇదే తరహా చర్చ జరుగుతోంది. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత.. ఆ తేదీని మిస్ కాకూడదనే ఉద్దేశంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సినిమా షూటింగ్‌కు నెలలు, సంవత్సరాలు కేటాయించి.. చివరి దశలో మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తక్కువ సమయం ఇవ్వడం ఎంతవరకు సరైనదనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున కూడా ‘లెనిన్’ మూవీ ఈవెంట్‌లో ప్రస్తావించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా తగినంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు.
నిజానికి సినిమా ఎంత పెద్ద స్కేల్‌లో ఉన్నా.. ప్రేక్షకుడికి థియేటర్‌లో కనిపించేది ఫైనల్ కట్ మాత్రమే. షూటింగ్ సమయంలో దర్శకుడు పడిన కష్టం, లొకేషన్స్, భారీ సెట్స్, వందల మంది టెక్నీషియన్ల శ్రమ.. ఇవేవీ ప్రేక్షకుడికి నేరుగా కనిపించవు. కానీ ఎడిటింగ్‌లో ఓ చిన్న తప్పు జరిగినా.. సౌండ్ మిక్సింగ్‌లో సరైన బ్యాలెన్స్ లేకపోయినా.. ఆ లోపం మాత్రం వెంటనే ప్రేక్షకుడికి అనిపిస్తుంది.
అందుకే సినిమా షూటింగ్ ఎంత ముఖ్యమో.. పోస్ట్ ప్రొడక్షన్ కూడా అంతే ముఖ్యం. ఒక సినిమా రిలీజ్ డేట్‌ను టార్గెట్ చేసుకుని షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్‌ను రేసులా పూర్తి చేయడం కంటే.. ఫైనల్ అవుట్‌పుట్‌కు అవసరమైన సమయం ఇవ్వడం కీలకం.
‘ది ప్యారడైజ్’ విషయంలో వస్తున్న ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్ విమర్శలు కూడా ఇప్పుడు ఇదే విషయాన్ని మరోసారి చర్చలోకి తీసుకొచ్చాయి. భారీ సినిమాలకు బడ్జెట్ ఎంత ముఖ్యమో.. పోస్ట్ ప్రొడక్షన్‌కు కేటాయించే సమయం కూడా అంతే ముఖ్యమని ఇండస్ట్రీ గుర్తించాల్సిన అవసరం ఉందనే చర్చ మొదలైంది.
మీకు నచ్చవచ్చు:
ది ప్యారడైజ్ మూవీ రివ్యూ
బాక్సాఫీస్ క్లాష్.. రాయుడు ముందు నిలబడలేకపోయిన బాస్.!
[Paradise Post Production, The Paradise Movie Review, Nani Paradise Review, Paradise Negative Talk, Paradise Public Talk, The Paradise Review, Natural Star Nani, Telugu Film News, Telugu News]





